ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం || Aalasyamavuthondhi Deva Song Lyrics

WhatsApp Group Join Now

Aalasyamavuthondhi Deva Song Lyrics Telugu

ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం- 2
అయినా అద్భుతమేదో దాగి ఉన్నది-2
నేననుకున్నది నాకు మంచిది కాదులే
నీవు ఇచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది-2
llఆలస్యమవుతోందిll

చరణం: 1
అబ్రహాము గర్భఫలము పై ఎదురుచూసెను
పనివాడే వారసుడేమో అని తలచెను- 2
బహుకాలము గడిచి మృతతుల్యమైన
శారా ఓడిలో ఇస్సాకుని ఉంచావు-2

సిగ్గుపడనియ్యవులే నేను నమ్మిన దాసులను
ఓడిపోనీయవులే నీవు ఎన్నుకున్నా జనులను-2
llఆలస్యమవుతోందిll

చరణం 2
ఆదాము దినములలో క్రీస్తు రాక ప్రవచనము
నాలుగువేల వత్సరములకు శిశువై జన్మించెను-2
మరలా వస్తానని దీర్ఘకాలం గడిచిన
రాలేదు ఎందుకని అపహాస్యము జరిగినా-2

రాబోవుచున్నావులే సిద్ధపరిచిన జీతముతో
తీసుకువెళతావులే పరిశుద్ధుల పరివారముతో-2
llఆలస్యమవుతోందిll

 

Aalasyamavuthondhi Deva Song Lyrics English

aalasyamavthondi deva nee karyam – 2
ayinaa adbhutamedo daagi unnadi – 2
nenanukunnadi naaku manchidi kaadule
neevu ichhinade naa jeevitaniki shreshtamainadi – 2
ll aalasyamavthondi ll

charanam: 1
abrahahamu garbhaphalamu pai eduruchusenu
panivaade vaarasude emo ani talachenu – 2
bahukaalamu gadichi mrutatyulaina
shaaraa odilo issakuni unchaavu – 2

siggupadaniyyavule nenu nammina daasulanu
odiponeyavule neevu ennukunna janulanu – 2
ll aalasyamavthondi ll

charanam 2
aadamu dinamulalo khristu raa ka pravachanamu
naalugu vela vatsaramulaku sishuvai janminchenu – 2
maralaa vastaanani deerghakaalam gadichina
raaledu endukani apahaasyamu jarigina – 2

raabovuchunavaale siddhaparichina jeethamuto
teesukuveltaavule parishuddhula parivaaramuto – 2
ll aalasyamavthondi ll

Leave a Comment