Yesunamam Entho Madhuram Lyrics Telugu
యేసు నామమెంతో మధురం – మధురం మధురం మధురం
దీన జనులు భాగ్యవంతుల్ – దివి రాజ్యంబు వారిదన్న|| యేసు || (మత్తయి5:3)
సాత్వికులగు జనులు భూమిని – స్వతంత్రించు కొందురన్న|| యేసు || (మత్తయి5:5)
కనికరించువారు ధన్యుల్ – కనికరంబు పొందెదరన్న|| యేసు || (మత్తయి5:7)
శుద్ధహృదయులు ధన్యుల్ దేవుని – చూతురని బహిరంగ పరచిన|| యేసు|| (మత్తయి5:8)
శాంతికరుల్ ధన్యుల్ వారు – స్వామిసుతులై యుందురన్న|| యేసు || (మత్తయి 5:9)
నా కొరకు హింసలను బొందు – మీకు దివి గొప్ప ఫలమని యన్న|| యేసు || (మత్తయి 5:11)
మీ సత్ క్రియలు చూచి ప్రజలు – మింటి తండ్రిన్ మెచ్చెదరన్న|| యేసు || (మత్తయి5:16)
నేను ధర్మశాస్త్రమునకు – నెరవేర్పై యున్నానని యన్న|| యేసు || (మత్తయి5:17)
నేను భవిష్యద్వాక్యములకు – నెరవేర్పై యున్నానని యన్న|| యేసు || (మత్తయి5:17)
అన్యాయముగా కోపపడిన – హత్య కార్యమని వచించిన|| యేసు || (మత్తయి5:22)
ద్రోహివని నీ సోదరు నన్న – ద్రోహివి నీవౌదు వన్న|| యేసు || (మత్తయి5:22)
పాపక్రియలు లేకపోయిన – చూపె పాపమని బోధించిన|| యేసు || (మత్తయి5:28)
మీరు పరులవల్ల కోరు – మేలు వారికి చేయుడన్న|| యేసు || (మత్తయి 7:12)
అన్నపానాదుల విషయం – బైన చింత కూడదన్న|| యేసు || (మత్తయి 6:25)
మొదట దేవ రాజ్యంబు వెదకిన – పిదప వన్నియు దొరకు నన్న|| యేసు || (మత్తయి 6:33)
మొదట దేవ నీతి వెదకిన – పిదప నన్నియు దొరకు నన్న|| యేసు || (మత్తయి 6:33)
తీర్పు తీర్చరాదు అపుడు – తీర్పు నీకు రాదని యన్న|| యేసు || (మత్తయి 7:1)
నాయొద్దకున్ రండియనుచు – ఆయాసపడు వారి నన్న|| యేసు || (మత్తయి 11:28)
మీ శత్రువులను ప్రేమించండి – మేలుచేయుచు నుండుడన్న|| యేసు || (లూకా6:33)
నిన్ను వలె నీ పొరుగువానిన్ – నెనరుతోనే చూడు మన్న|| యేసు || (లూకా 10:17)
దేవుడు మీ తండ్రి యనెడి – దివ్య బంధుత్వంబు దెల్పిన|| యేసు || (లూకా11:13)
నరులు మీ సహోదరులను – వరుస బైలుపరచి యున్న|| యేసు || (యోహాను 10:16)
రోగులకు గల వ్యాధుల్ మీరు – బాగు చేయవలెనని యన్న|| యేసు || (మత్తయి 10:8)
ఉచితముగా పొందితిరి గనుక – ఉచితముగానే ఇయ్యుడన్న|| యేసు || (మత్తయి 8:10)
ఏమి యడిగిన చేతునన్న – హితవాక్యంబు పలికియున్న|| యేసు || (యోహాను14:14)
తలుపువేసి దైవప్రార్ధన – సల్పిన ప్రతిఫలమని యన్న|| యేసు || (మత్తయి6:6)
ప్రార్ధనమున వ్యర్ధమైన – పలుకు వల్లపడదని యన్న|| యేసు || (మత్తయి6:7)
కలిగియున్న విశ్వాసంబు – వలన నీకు కలుగునన్న|| యేసు || (మత్తయి 9:29)
కార్యసిద్ధికి ముందే నమ్మిన – కార్యసిద్ధి యౌనని యన్న|| యేసు || (మార్కు 11:24)
పరుల కెరుక పరుపగల యుప – వాసము చేయరాదని యన్న|| యేసు || (మత్తయి 6:16)
నాకుమార ధైర్యమొందుము – నీకు పాప క్షమయని యన్న|| యేసు || (మత్తయి9:2)
నిన్ను శిక్షింపను పొమ్ము మరల – నేరమున పడరాదని యన్న|| యేసు || (యోహాను 8:1)
నశియించిన రక్షించుటకు – నరలోకమునకు వచ్చితి నన్న|| యేసు || (లూకా19:10)
కుడిచేతితో చేయు ధర్మము – యెడమచేతికి తెలియ రాదన్న|| యేసు || (మత్తయి 6:3)
తక్కువ చందాను చూచి – ఎక్కువేయని మెచ్చుకొన్న|| యేసు || (లూకా 21:3)
ఎక్కువ చందాను చూచి – తక్కువగనె యెంచి యున్న|| యేసు || (లూకా 21:3)
లోకమందు మీకు శ్రమలు – లోమును జయించితి నన్న|| యేసు || (యోహాను 16:33)
నేనే పునరుత్థానమై యు – న్నానని ధైర్యంబు చెప్పిన|| యేసు || (యోహాను 11:25)
నన్ను నమ్మువాడు మృతుడై – నప్పటికిని బ్రతుకు నన్న|| యేసు || (యోహాను 11:25)
బ్రతికి నన్ను నమ్మువాడె – ప్పటికిని మృతిపొంద డన్న|| యేసు || (యోహాను 11:26)
ఒక్కచోటనే నేను మీరు – ఉందుమని ప్రవచించియున్న|| యేసు || (యోహాను 14:3)
మరల వచ్చి మిమ్ముమోక్ష – పురము కొంచుపోదునన్న|| యేసు || (యోహాను 14:3)
నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమని విన్పించిన|| యేసు || (యోహాను 14:6)
ననుజూచిన దేవుని జూచి – నట్లే యనుచు వెల్లడించిన|| యేసు || (యోహాను 14:9)
నా క్రియలకు మించు క్రియలు – నా విశ్వాసులు చేతురన్న|| యేసు || (యోహాను 14:12)
పరిశుద్ధాత్మ మీయందు ని – వాసము చేయ పంపెద నన్న|| యేసు || (యోహాను 14:17)
మీరు నాలో నేను మీలో – మిళితమై నివసింతు మన్న|| యేసు || (యోహాను 14:20)
నాకు వేరై మీరు ఏమియు – నడప లేరని నిరుకు చెప్పిన|| యేసు || (యోహాను 15:5)
సర్వసృష్టికి నా సువార్త – చాటుడంచు నానతిచ్చిన|| యేసు || (మార్కు 16:15)
పరిశుద్ధాత్మ వచ్చు వరకు – ప్రకటనకు బోరాదని యన్న|| యేసు ||(లూకా 24:49; అపో.కా.1:4,5,8)
యేసువలెనె పల్కువారు – ఎవరు లేరని పేరొందిన|| యేసు || (యోహాను 7:46)