యేసుక్రీస్తు వారి కథవినుడి || Yesukristu Vari Kathavinudi Lyrics

WhatsApp Group Join Now

Yesukristu Vari Kathavinudi Lyrics Telugu

యేసుక్రీస్తు వారి కథవినుడి – దేశీయులారా – యేసు క్రీస్తువారి
కథ వినుడి = దోసకారులన్ రక్షింప – దోసములంటని రీతిగనె
దాసుని రూపంబుతో మన – ధరణిలో వెలసిన దేవుండౌ|| యేసుక్రీస్తు ||

1. రోగులన్ కొందరినిజూచి – బాగుచేయనని యనలేదు – రోగముల
తీరది పరికించి – బాగుచేయ లేననలేదు – రోగముల నివారణకైన –
యోగముల్ తాజెప్పలేదు – యోగ యోగుల మించు వైద్య – యోగి
తానని ఋజువు గొన్న|| యేసుక్రీస్తు ||

2. పాపులను నిందించి యే విధ – శాప వాక్కుల్ పల్కలేదు – పాపులకు
గతి లేదని చెప్పి – పారద్రోలి వేయలేదు కోపపడుచు పాపులను
రా – కూడదని వచియింపలేదు = పాపములు పరిహారము చేసి –
పరమదేవుడు తానని తెల్పిన|| యేసుక్రీస్తు ||

3. నరులకు దేవుడు తండ్రియను – వరుస బైలుపరచినాడు – పొరుగు
వారు సోదరులన్న – మరొక వరుస తేల్చినాడు – మరియు దేవున్
పొరుగు వారిన్ – సరిగ ప్రేమించు మన్నాడు = కొరత లేకుండ
సర్వాజ్ఞల్ – నెరవేర్చి మాదిరి జూపిన|| యేసుక్రీస్తు ||

4. వాక్కు విన వచ్చిన వారలకు – వాక్యాహారమున్ తినిపించె – ఆకలితో
నున్న ఆ – యైదు వేలన్ గనికరించె – మూకకు వండని రొట్టెలను
బుట్టించి తృప్తిగా వడ్డించె = లోకమంతకు పోషకుడు తా – నే కదాయని మెప్పుగాంచిన|| యేసుక్రీస్తు ||

5. దురితములను తత్ఫలములను – దుష్టుడౌ సైతానును గెల్చె – తరుణ
మందు మృతులన్ లేపె – దయ్యములను దరిమి వైచె – నరుల
భారమున్ వహియించి – మరణమొంది తిరిగిలేచె = తిరుగవచ్చెద
నంచు మోక్ష – పురము వెళ్ళి గూర్చున్న|| యేసుక్రీస్తు ||

6. పాపులకు రోగులకు బీద – వారికి దేవుండు యేసే – ఆపదలన్నిటిలో
నిత్య – మడ్డు పడు మిత్రుండు క్రీస్తే – పాపమున పడకుండ గా –
పాడెడు శిల యేసుక్రీస్తే = పాపులాశ్రయించిన యెడల – పర
లోకమునకు గొంపోవు|| యేసుక్రీస్తు ||

7. మరల యూదుల్ దేశమునకు – మళ్ళుచున్నారిది యొక గుర్తు
పరుగు లెత్తుచున్నవి కారుల్ – బస్సులు ఇది మరియొకగుర్తు –
కరువులు మతవాదాలు భూ – కంపముల్ యుద్ధా లొకగుర్తు =
గురుతులై పోయినవి గనుక – త్వరగ వచ్చుచున్న శ్రీ|| యేసుక్రీస్తు ||

Yesukristu Vari Kathavinudi Lyrics English

Yesukristu Vari Kathavinudi – Desiyulara – Yesu Kristuvari
Kathavinudi = Dosakarulan Rakshimp – Dosamulanti Ritiganne
Dasuni Rupambuto Mana – Dharnilo Velasina Devundau || Yesukristu ||

Stanza

 Rogulan Kandarini Juchi – Bagucheyana Yanaledu – Rogamula
Tiradi Parikinci – Bagucheya Lananaledu – Rogamula Nivaranaikaina –
Yogamul Tajeppalenu – Yoga Yogula Minchu Vaiddya – Yogi
Tanani Ruju Gonn || Yesukristu ||

Stanza

Papulanu Nindinchi Ye Vidha – Shapa Vakkul Palkaledu – Papulaku
Gati Ledani Cheppi – Paradroli Veyaledu Kopapaduchu Papulanu
Ra – Kudadani Vachiyinpalenu = Papamulu Pariharamu Chesi –
Paramadevudu Tanani Telpin || Yesukristu ||

Stanza

Narulaku Devudu Tandriyanu – Varusa Bailuparacinaadu – Porugu
Varu Sodharulanna – Maroka Varusa Telc inaadu – Mariyu Devun
Porugu Varin – Sariga Preminchu Mannadu = Korata Lekunda
Sarvajnal – Neraverci Madhiri Jupin || Yesukristu ||

Stanza

Vakku Vina Vacchina Varalaku – Vakyaharamun Tinipinc he – Akalito
Nunna A – Ya idu Velan Ganikarinc he – Mukaku Vandani Rot telanu
Buttinci Truptiga Vaddinc he = Lokamantaku Poshakudu Ta –
Ne Kadayana Meppuganc ina || Yesukristu ||

Stanza

Duritamulu Tatphalamulu – Dushtuda Sathanunu Gelc he – Taruna
Mandu Mrutulan Lep e – Dayyamulu Darimi Vaic he – Narula
Bharamun Vahiyinci – Maranamongi Tirigilec he = Tiruga Vacched
Nancu Moksha – Puramu Velli Gurc unna || Yesukristu ||

Stanza

Papulaku Rogulaku Bida – Variki Devund u Yese – Apadalannitilo
Nitya – Maddupadu Mitrund u Kriste – Papamuna Padakunda Ga –
Padedu Sila Yesukriste = Papulashrayinc ina Yedal – Para
Loka munaku Gompoovu || Yesukristu ||

Stanza

Mara Yudul Desamunaku – Malluchunna Ridi Yo Guru
Parugu Lettuc unnavi Karul – Bassulu Idi Mariyogurtu –
Karuvulu Matavadalu Bhu – Kampamul Yuddha Lokagurtu =
Gurutulai Poyinavi Ganuka – Tvaraga Vaccuc unna Sri || Yesukristu ||

Leave a Comment