WhatsApp Group
Join Now
యేసు వాక్యమే మిఠాయి
1. భాసురమైనట్టి బంగారు మిఠాయి – పాప కర్మలకు
దొరుకునటోయి – దోషములను మద్దించిన రాయి
ఆశ చేత మీరిది కొనండి
2. తల్లి దండ్రులను ప్రేమించేటి – ధన్యులకు దొరుకనంటి
మిఠాయి ఉల్లను – మరిచి తిరిగే వారికి
తిన్నట్లు ఉండదు-కమ్మని మిఠాయి
3. వేదసారమును అమృతముబోల్న – జ్ఞానసారమునుపిండితో
విసికి ఆకాశపక్షులని అగ్నిలో ద్రోచి – భగభగ మండేటి
మంటనుమండడి రండిగ భక్తులు వండిన మిఠాయి
4. ఇష్టముకాని మిఠాయి తింటే-కష్టముకాని త్రోవదెల్పును
నిష్ఠినిగలు నిల్చి వేయును-దుష్టగుణములను ద్రుంచి వేయును
సమ్మతి లేని పాపుల కెల్ల కుమ్మరపానయే కమ్మని మిఠాయి
5. యేసు వాక్యమును మిఠాయి తింటే-సర్వపాప కర్మలు
అంతరించునును – యేసు వాక్యమును మిఠాయి తింటే
సర్వరోగములు హరించును
6. యేసు వాక్యమును మిఠాయి తింటే – సర్వభూతములు
పారిపోవును – యేసు వాక్యమును మిఠాయి తింటే
నరకము తప్పును మోక్షము దొరుకును
Yesu Vaakyame Mitaayi Lyrics English