Yesu Prabhuva Maa Hita Lyrics Telugu
యేసు ప్రభువా మా – హిత బోధకుండ
దోసములు క్షమియించు – దొడ్డ జనకుండ|| యేసు ||
1. రోగములు మాన్పు – రూఢి వైద్యుండ
బాగు చేసి పంపు – పరమ నాధుండ
|| యేసు ||
2. తలమీద గల వెంట్రు – కలు రాలు వ్యాధి
అలుము కొన్నను అవి – మొలిపింప గలవు
|| యేసు ||
3. తలకున్న వ్యాధులు – తొలగించి ముదము
కలిగించి ముఖమునకు – కళనియ్య గలవు
|| యేసు ||
4. నిదుర రాని వేళ – నిన్ను ప్రార్ధింప
నిదుర రానిత్తువు – నిజ విశ్రాంతి దొరకు
|| యేసు ||
5. పీనసము నాసికను – పీడించు చుండ
దీనిని మొదలంట – దీసి వేయుదువు
|| యేసు ||
6. దంత వ్యాధులు నోటి – దరిని లోపల పైన
అంతట నున్నవి – అణచి వేయుదువు
|| యేసు ||
7. జలుబును దగ్గును – క్షయ రోగాదులను
నిలువ కుండచేసి – నెమ్మది యిత్తువు
|| యేసు ||
8. గొంతుక కాయలును – కంతులను వాపులను
అంతర్ధానము చేసి – ఆదరింతువు
|| యేసు ||
9. గుండె నొప్పులు లే – కుండ జేయుదువు
మండు మంటను ఆర్పి – మహిమ చూపుదువు
|| యేసు ||
10. ఉదర వ్యాధుల నెల్ల – వదలించి వేసి
కదలని దుస్థితి – విదలింప గలవు
|| యేసు ||
11. ప్రేగు ప్రక్కను చిన్న – ప్రేగు మొలవంగ
సాగ కుండ దాని – లాగి వేయుదువు
|| యేసు ||
12. మూత్ర వ్యాధులకు వి – ముక్తి దయ చేసి
స్త్రోత్రంబు చేయగల – చురుకుదన మిత్తువు
|| యేసు ||
13. మూల శంక యే – మూల నుండకుండ
మూలము పెరికి అను – కూలపరతువు
|| యేసు ||
14. చర్మ వ్యాధులు తత్ – సంబంధ బాధలు
నిర్మూలించి కుదురు – నెలకొల్ప గలవు
|| యేసు ||
15. పడి దెబ్బ తగిలిన – పగవారు కొట్టిన
పడిన గాయము మాన్పి – బ్రతికింప గలవు
|| యేసు ||
16. గుచ్చుకొన్నవి పైకి – వచ్చునట్లు చేసి
స్వేచ్చగ నిక తిరుగ – వచ్చునన గలవు
|| యేసు ||
17. పొడలు మచ్చలు కాల్పు – పులిపిరి కాయలు
చిడుము కడిగి మరల – చేర నియ్యవు
|| యేసు ||
18. విరిగిన శల్యముల్ – సరిగా చేసి యతికి
కరుకుమను ధ్వనియైన – కలుగ నియ్యవు
|| యేసు ||
19. రక్తము తగ్గిన – రక్తము హెచ్చిన
రక్తము సరిజేసి – రంజిల్ల జేతువు
|| యేసు ||