యేసు నరుడే కాడు విన్న || Yesu Narude Kaadu Lyrics

WhatsApp Group Join Now

Yesu Narude Kaadu Lyrics Telugu

పల్లవి: యేసు నరుడే కాడు విన్న – యేసు ప్రభువే దేవుడన్న
యేసు మార్గము ఎరుగకున్న – ఎటుల మోక్షము చేరుటన్న
యేసు క్రీస్తుని నమ్మకున్న – ఎవరికైనను శిక్షయే
ఏ నరునికైనను శిక్షయే

||యేసు||

చరణం 1: నరులు పాపులు గాన నరుడే – నరుని బ్రోవగ జాలదన్న
నరుడుగాని దేవుడే యొక – నరుడుగా గాన్పించెగా

||యేసు||

చరణం 2: దేవ లోక నామమన్న – దేవ వాక్య శరీరమన్న
దేవునాత్మ సురక్తమన్న – దేవుని స్వరూపమే

||యేసు||

చరణం 3: దేశ నామము – యేసు అన్న వి – దేశనాయము చదువుమా
దేశము నామము కాదు మోక్ష – దేశనామము కనుకనే

||యేసు||

చరణం 4: తల్లి పేరు జన్మ స్థలము పేరు – ముందుగా తల్లివారికి తెలిపెగాన
తానె మొదటివాడుగా

||యేసు||

చరణం 5: దేవుడే పుట్టించు సర్వము – దివి భువిలో నైనను
దేవునిని పుట్టించువాడే – దిక్కు గలడో వెదకుడి

||యేసు||

చరణం 6: కన్యకు జన్మించువాడె – ఘనుడు దేవుడు శాస్త్రము
కన్యకు జన్మింపకున్న – కాదు దేవుడు సూత్రము

||యేసు||

చరణం 7: యేసు కన్యలో పుట్టెగాన – యేసు దేవుడు యెరుగమన్న
యేసు జన్మము అద్భుతంబు – యేసు జన్మ మసాధ్యము

||యేసు||

చరణం 8: ఆత్మ భవుడు స్వయంభవుడు – ఆయనొక్కడే ధరణిలో
ఆత్మ క్రీస్తుని ఆత్మ లేక – అవనిలో గ్రహింపరు

||యేసు||

చరణం 9: నరుల అఘము హరింపదేవ – నరుడుగా అవతారమెత్తి
మరణమొందియు బ్రతికెగాని – తరతరముల సజీవుడే

||యేసు||

చరణం 10: యేసు అంటే రక్షకుడు – క్రీస్తు అంటే ఖాయము
యేసు నామము గాక ఇంక – వేరే లేదని అర్థము

||యేసు||

Yesu Narude Kaadu Lyrics English

Pallavi: Yesu narude kaadu vinna – Yesu prabhuve devudanna
Yesu maargamu erugakunna – etula mokshamu cherutanna
Yesu Kristuni nammakunna – evarikainu shikshaye
Ye narunikainu shikshaye

|| Yesu ||

Charanam 1:
Narulu paapulu gaana narude – naruni brovaga jaaladanna
Narudugani devude yoka – naruduga gaanpainchega

|| Yesu ||

Charanam 2:
Deva loka namamanna – deva vakya shareeramanna
Devunaatma suraktamanna – Devuni svaroopame

|| Yesu ||

Charanam 3:
Desa naamamu – Yesu anni vi – deshanaayamu chaduvuma
Desamu naamamu kaadu moksha – desanaamamu kanukone

|| Yesu ||

Charanam 4:
Talli peru janma sthalamu peru – munduga tallivaariki telipegaana
Taane modativaduga

|| Yesu ||

Charanam 5:
Devude puttichu sarvamu – divi bhuvilo nainu
Devunini puttichhuvaade – dikku galado vedakudi

|| Yesu ||

Charanam 6:
Kanyaku janminchuvade – ghanudu devudu shaastramu
Kanyaku janminchakapunna – kaadu devudu suthramu

|| Yesu ||

Charanam 7:
Yesu kanyalo puttegaana – Yesu devudu yerugamanna
Yesu janmu adbhutamu – Yesu janma masadhyamu

|| Yesu ||

Charanam 8:
Aathma bhavudu svayambhavudu – ayano kkade dharanilo
Aathma Kristuni aathma leka – avani lo grahiparu

|| Yesu ||

Charanam 9:
Narula aghamu harimpadeva – naruduga avatarametti
Maranamondiyu bratikegaani – tarataramula sajeevude

|| Yesu ||

Charanam 10:
Yesu ante rakshakudu – Kristu ante khaayamu
Yesu naamamu gaaka inke – vere ledani arthamu

|| Yesu ||

Leave a Comment