యెహోవా మా తండ్రి గాడ || Yehova Maa Thandri Lyrics

WhatsApp Group Join Now

Yehova Maa Thandri Lyrics Telugu

యెహోవా మా తండ్రి గాడ – యేసుడు మాయన్నగాడ =
మహిమగల శుద్ధాత్మ యిట్టి-వరస దెలిపంగడ మాతోడ

||యె||

1. మోక్ష నగరు మాపుట్టిల్లు -ముఖ్య దూతల్ మా
స్నేహితులు = సాక్షాత్కారమై యున్నప్పుడు –
లక్ష్యపెట్ట మిహ బాధలకు

||యె||

2. అబ్రహాము దావీదు మొదలై – నట్టి వర భక్తాగ్రేసరులే =
శుభ్రముగ మా చుట్టలైనన్ -హర్షమిక మాకేమి కొదువ

||యె||

3. పేతురాది సకలాపోస్తుల్ – పేర్మిగల మా నిజకూటస్థుల్ =
ఖ్యాతి సభలో మేమున్నప్పుడు-ఘనతలిక మాకేమి కొదువ

||యె||

 4. తనువు బలిపెట్టెను మాయన్న -తప్పుల్విడగొట్టెను=
మాతండ్రి=మనసులో సాక్ష్యమిట్లున్న-మనుజులెట్లన్నను మాకేమి

||యె||

5. పరమవిభు జీవగ్రంధములో – ప్రభుని రక్తాక్షరముద్రితమై =
చిరముగా నుండు మాపేరు – చెరుపు బట్టెడు వారింకెవరు

||యె||

6. కరములతో నంటరాని – కన్నులకు గోచరముగాని=
పరమ ఫలముల్ మాకున్నప్పుడు – సణుగు కొనమిక్కడి లేములకు

||యె||

Yehova Maa Thandri Lyrics English

Yehovah maa thandri Gaada – Yesudu maayannagaad =
Mahimagala shuddhaathma yitti-varasa delipangada mathodu

||Ye||

Moksha nagaru maa puttilu – mukhya doothalu maa
snehitulu = saakshaatkaaramai yunnappudu –
lakshyapetta mihi baadhalaki

||Ye||

Abrahaamu Daaveedu modalai – nattivaara bhakta-agresarule =
shubhramuga maa chuttalainan – harshamika maa kemi koduva

||Ye||

Peturadi sakalapostul – permigala maa nijakutasthul =
khyaati sabhalō memunnappudu – ghanatalika maa kemi koduva

||Ye||

Tanuvu balipettēnu maayan – tappul vidagottēnu =
mathandri = manasulo saakshyamitala yunnā – manujulētlānnu maa kemi

||Ye||

Paramavibhu jeevagranthamulo – prabhuni raktākshara mudritamai =
chiramuga nunchu maaperu – cherupu batteḍu varin kēvaru

||Ye||

Karamulato nantaranī – kannulaku gocharamugani =
parama phalamul maa kunnappudu – sanugu konamikkadi lēmulaku

||Ye||

Leave a Comment