ఏ రీతి స్తుతియింతును || Ye Reethi Stutiyintunu Lyrics

WhatsApp Group Join Now

Ye Reethi Stutiyintunu Lyrics Telugu

ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా

||ఏ రీతి||

ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా

||ఏ రీతి||

ఈ మనుష్యులు ఈ వైద్యులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా

||ఏ రీతి||

నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా

||ఏ రీతి||

Ye Reethi Stutiyintunu Lyrics English

Ye Reeti Stutiyintunu – O Yesu Naatha Daivama
Ye Reeti Varnintunu – Nee Prema Madhurambunu
Nee Kripalanu Talaposukonuchu – Nee Paadaalu Cheeraanayya
Neeku Krutajnatatulu Chellinpa Madhilo – Naa Kanneelu Migilayaayya

||Ye Reeti||

Ekaakinaai Nee Dukhaarthilo – Ee Toadu Gaanani Naaku
Emaudunuo Etu Poudunuo – Etu Tochaka Nunna Nannu
Ee Bhayamuneekela Yanuchu – Abhayambu Nichaavaayya
Ee Daari Kanabadaani Vela – Nee Odilopu Daachaavaayya

||Ye Reeti||

Ee Manushyulu Ee Vaidyulu – Ennennuo Chesina Gaani
Naa Praanamua Naa Dehamu – Nee Swaadheenambhegadaayya
Naa Swaami Naathonai Untu – Naa Kaapariga Nilichaavaayya
Naakeemi Spuhru Laeni Vela – Oopirini Posaavaayya

||Ye Reeti||

Nee Premanu Nee Perunu – Naenennadhu Maruvaleenu
Nee Karunanu Nee Jalinee – Ee Manishilo Chudalenu
Nija Daivamu Neevaye Yanuchu – Nee Vaipai Nee Choochaanayya
Yehova Raaphaa Naenanuchu – Ee Swasthatanu Ichchaavaayya

||Ye Reeti||

Leave a Comment