Vinaraayya Vinaraayya Song Lyrics Telugu
వినరయ్య వినరయ్య – యేసు ప్రభావము – గనరయ్య క్రీస్తుని
ఘన కార్యంబు = మనసు యేసుని కథపై – మలపి యోచించిన
మహిమ కనబడు నీకు అనుభవము దొరకు
|| వినరయ్య ||
1. కుసుమ రోగియైన – కోమలి యొకరు నీ – రసమై పోవుచు మిగుల
వ్యసన పడుచుండెన్ = బస విడిచి దారిలో – ప్రభు యేసునిన్ జూడ – నిసు
మంతైన సందే – హింపదాయె
|| వినరయ్య ||
2. పన్నెండేండ్ల నుండి – పరమ వైద్యుల యొద్ద మందు బుచ్చుకొనిన
మానదాయె = ఇన్నాళ్ళకీ వేళ – యేసు చెంగు ముట్ట – నిడుమ
లన్నిటి నుండి – విడుదలాయె
|| వినరయ్య ||
3. తన జబ్బు పోవును – అని యామె యనుకొన్న – అనుకొనుట
విశ్వాస – మాయె ముదిరి = అనుకొన్నట్టే జబ్బు – అంతర్దానమాయె
అనుకొనుటే కష్టంబా – అదరుట కన్న
|| వినరయ్య ||
4. అట్టి విశ్వాసంబు – అమరిన రోగికి – ఎట్టి వ్యాధియైన – ఎగిరిపోదా
= బట్ట ముట్టుకొనుట – బహిరంగ కార్యంబె – గట్టి నమ్మిక మదిలో
గలుగు కార్యంబు
|| వినరయ్య ||
5. అనుకొన్న పిదప యే – సుని వెనుకకున్ జేరి – అటు పిమ్మట
అంగీ – అంచంటు కొనియె = అనుకొమ్ము క్రీస్తుని – అండ జేరుము
అంటు – కొనుము విశ్వాసంబు – అను చేయి చాపి
|| వినరయ్య ||
6. విశ్వాసము లేని విసుగుదల సమయాన – విశ్వాస మిమ్మని –
వేడు కొనుము = విశ్వమంతటిని గా – వించిన నీ తండ్రి –
విశ్వాసంబును గా – వింప లేడా
|| వినరయ్య ||
7. ప్రతి సోమవారము – ప్రభు క్రీస్తు బోధలకు – ప్రతి వ్యాధి చిక్కు
పరిహారము = ప్రతివారు గుంటూరు – బయట కాకానిలో –
స్వస్థిశాలను వెదకి – చూచి వెళ్ళండి
|| వినరయ్య ||
8. జనక కుమారాత్మ – లను దేవ స్తోత్రంబు – మనుజులు తక్కువ
మానవుల నంటు = కొన నియ్యరు నీవు – కోరి నిన్ను అంటు –
కొన నిచ్చి స్వస్థత – గన నిత్తువు
|| వినరయ్య ||
Vinaraayya Vinaraayya Song Lyrics English
Vinaraayya vinaraayya – Yesu prabhavamu – ganaraayya Kristuni
Ghana karyambu = Manasu Yesuni kathapai – malapi yochinchina
Mahima kanabadu neeku anubhavamu doraku
|| Vinaraayya ||
1. Kusuma rogiyaina – komali yokaru ni – rasamai povuchu migula
Vyasana paduchundenu = basa vidichi darilo – Prabhu Yesunini juda – nisu
Mantaina sande – himpadayye
|| Vinaraayya ||
2. Panneendandlu nundi – parama vaidyula yokada mandu bucchukonina
Manadayye = Innallaki vela – Yesu chengu mutta – niduma
Lanniti nundi – vidudalayye
|| Vinaraayya ||
3. Tana jabba povunu – ani yame yanukonna – anukonuta
Vishvasa – mayye mudiri = Anukonnatte jabba – antardaanamayye
Anukonute kashtamba – adaruta kanna
|| Vinaraayya ||
4. Atti vishvasambu – amarina rogiki – etti vyadhiyaina – egiripoda
= Batta muttukonuta – bahiranga karyambe – gatti namika madilo
Galugu karyambu
|| Vinaraayya ||
5. Anukonna pidapa ye – suni venukakun jeri – atu pimmata
Angi – anchantu koniye = Anukonmu Kristuni – anda jerumu
Antu – konumu vishvasambu – anu cheyi chaapi
|| Vinaraayya ||
6. Vishvasamu leni visugudala samayana – vishvasa mimmani –
Vedu konumu = Vishvamantatini ga – vichina ni tandri –
Vishvasambunu ga – vinpa leda
|| Vinaraayya ||
7. Prati somavaramu – Prabhu Kristu bodhalaku – prati vyadhi chikku
Pariharamu = Prativaru Gunturu – bayata kakaanilo –
Svasthishalalu vedaki – chuchi vellandi
|| Vinaraayya ||
8. Janaka kumaaraatma – lana deva stotrambu – manujulu takkava
Manavula nantu = Kona niyyaru nivu – koru ninu antu –
Kona nichchi svastata – gana nittuvu
|| Vinaraayya ||