Upakaari Nuti Neekau Lyrics Telugu
ఉపకారీ నుతి నీకౌ – ఉపకారులన్ మించిన
ఉపకారి వీవె కావా – నెపముల నెంచకనె
కృప నధికముగా – జూపించు మా – అపకారములను మాపు
|| ఉప ||
1. రేయి యంతటను మేము – హాయిగా నిదుర బోవ
కాయునట్టి దూ – తను మా – కై ఏర్పచినావు
ఏ యపాయము నైనను రా – నీయ నట్టి గొప్ప
|| ఉప ||
2. మంచు కురియు కాలమున – సంచరింప లేము స్వేచ్ఛన్
ఎంచు కొనిన పనుల్ – సాగవు సరిగా
మంచివారికి సహితంబు – పొంచి యుండు న – నారోగ్యంబు – త్రుంచి వేయ గలమా
|| ఉప ||
3. ఎండకు గాడ్పులు కొట్టు – మండుచు పొక్కును కాళ్ళు
ఉండ నందున నీ – రెక్కడను నోరు
ఎండుకొని పోవును – అండ యుండదు ఇండ్లు కాలి
గండములను దాటించు
|| ఉప ||
4. వానకు పడిసెము పట్ట – నానుపు వరదలు రాగ
మానవు లెందరో – మరణము కాగా
ఈనాడు మా చేత – గానములు చే – యించుట కొరకై
హానిని పరిహరించిన మా
|| ఉప ||
5. కలహములు వ్యాధులును – పలు విధములైన లేముల్
నిలువున మ్రింగు భూకంపములు – పలుమారు దుర్వార్తలు
కలుగుట వలన – కలిగిన కలతలు
తొలగించుచు వచ్చిన మా
|| ఉప ||
6. దురితాత్మల పీడలను – నరుల వలన వచ్చు బాధల్
తిరిగెడు మృగముల వలన కీడు – పురుగుల కాటును మరి
జలచర పక్షుల – వలన హాని
దొరలగ దొర్లించిన మా
|| ఉప ||
7. పాపకారకు డపవాది – పాప నైజమొక యపవాది
పాప ఫలితంబు నొక యపవాది – శాపమొక యపవాది
పాప శోధన – యొక యపవాది
ఆపుచు వచ్చుచున్న మా
|| ఉప ||
8. జీవితము మేలొంద – నేవి కలుగ జేసితివో
ఆ వస్తువుల వలననే మాకు – చావు వచ్చె నకటా!
నీ వాక్యాతి – క్రమ ఫలమిదియే
మా విచారము బాపు
|| ఉప ||
9. జనక సుతాత్మల ప్రభువునకు – అనయము మహిమ భక్తులౌ
మనుజు లలో దూ – తలలో మోక్ష
జనులలో నా మదిలో – తనదు సృష్టి యంతటి లోను
ఘనత లభించును గాక
|| ఉప ||
Upakaari Nuti Neekau Lyrics English
Upakaari Nuti Nee Kau – Upakaarulana Minchina
Upakaari Veve Kaavaa – Nepamula Nenchakane
Krupa Nadhikamugaa – Joopincchu Maa – Apakaar mulanu Maapu
|| Upa ||
Reyi Yantatanu Memu – Haayiga Nidura Bovaa
Kaayunatthi Doo – Tanu Maa – Kai Yer pachinaavu
Ee Yapaayamu Nainanu Raa – Nee Yana tthi Goppa
|| Upa ||
Manchu Kuriyu Kaalamuna – Sancharinpa Lemu Swecchan
Encchu Konina Panula – Saagavu Sarigaa
Manci vaariki Sahitantambu – Ponchi Yundu Na – Naarogyambu
Trunchi Veya Galamaa
|| Upa ||
Endaku Gaadpulu Kottu – Manduchu Pokkun u Kaallu
Unda Nanduna Nee – Rekkadanu Noru
Endukoni Povunu – Anda Yundhadhu Indlu Kaali
Gandamulana Daatincchu
|| Upa ||
Vaanaku Padisemu Patta – Naanupu Varadalu Raagaa
Maanavu Lendaro – Maranam u Kaagaa
Eenadhu Maa Cheta – Gaanamula Che – Yincchut Korakait
Haanini Pariharincchina Maa
|| Upa ||
Kalaha mulu Vyaadhulunu – Palu Vidhamulaina Lemula
Niluvuna Mringu Bhoompamul u – Palumaaru Durvaarthalu
Kaluguta Valana – Kaligina Kalatalu
Tolagincchu Vacchina Maa
|| Upa ||
Duritaathmala Peedalana – Narula Valana Vacchu Baadhala
Tirigedu Mruga mula Valana Keedu – Puruga la Kaatumu Mari
Jalachara Pakshula – Valana Haani
Doralaga Dorlincchina Maa
|| Upa ||
Paapakaaraku Dapavaadi – Paapa Naijamoka Yapavaadi
Paapa Phalitambu Noka Yapavaadi – Shaapamoka Yapavaadi
Paapa Shodhana – Yoka Yapavaadi
Aapucchu Vacchunna Maa
|| Upa ||
Jeevitamu Melondaa – Neevi Kaluga Jesitivo
Aa Vastuvula Valananee Maaku – Chaavu Vacche Nakataa!
Nee Vaakyathi – Krama Phalamidiyee
Maa Vichaaramu Baapu
|| Upa ||
Janaka Sutaathmala Prabhuvanaku – Anayam u Mahima Bhaktulau
Manuju Laloo Doo – Talalo Moksha
Janulaloo Naa Madhilo – Tanadhu Srushti Yantati Loonu
Ghanata Labhincchunu Gaakaa
|| Upa ||