Srujanakaaruda Nijamaina Devuda Lyrics Telugu
సృజన కారకుడా నిజమైన దేవుడా
సర్వోన్నత స్థలములలో నివసించే యేసయ్యా ॥ 2 ॥
నీ సత్య స్వభావమును నాలో రూపించి
కృపవెంబడి కృపను నాపై చూపితివి ॥ 2 ॥
దివి నుండి దిగివచ్చిన దివ్య సుందరుడా
దీనులకు నీవే ఆశాజ్యోతివి ॥ 2 ॥
నీ ప్రజల క్షేమముకై మా మధ్యన నిలిచితివి
సంతోష సంబరాలు దయచేసితివి ॥ 2 ॥
॥ సృజన ॥
సమీపించరాని తేజస్సుగలవాడా
అమరత్వము కలిగిన మహనీయుడవు ॥ 2 ॥
విశ్వాధినేతవు నీవే యేసయ్యా
అతి త్వరలో రానున్న రారాజువు ॥ 2 ॥
॥ సృజన ॥
మమతను కురిపించే మధురా నగరిలో
నీ మనోహర ముఖమును దర్శించెదను ॥ 2 ॥
నా శ్రమ, దుఃఖమును నేను మరచిపోయి
నీ పరిశుద్ధులతో చేరి హర్షించెదను ॥ 2 ॥
॥ సృజన ॥
Srujanakaaruda Nijamaina Devuda Lyrics English
Srujana Kaarakuda Nijaamaina Devuda
Sarvonnala Sthalamulalo Nivasinche Yesayya ॥ 2 ॥
Nee Satya Svabhaavamunu Naalo Roopinchi
Krupavembadi Krupanu Naapai Choopitivi ॥ 2 ॥
Divi Nundi Digivachchina Divya Sundaruda
Deenulaku Neeve Aasha Jyotivi ॥ 2 ॥
Nee Praja Lakshyamukhai Ma Madhyana Nilichitivi
Santosha Sambaraalu Dayachesitivi ॥ 2 ॥
॥ Srujana ॥
Sameepincharani Thejasugalavaada
Amaratvamuni Kaligina Maha Neeyudavu ॥ 2 ॥
Vishwaadhineta Neve Yesayya
Ati Tvaralo Raannunna Raarajuuvu ॥ 2 ॥
॥ Srujana ॥
Mamatanu Kuripinche Madhura Nagarilo
Nee Manohara Mukhamunu Darshinchedanu ॥ 2 ॥
Naa Srama, Dukhamunu Neenu Marachipoyi
Nee Parishuddhulata Chiri Harshinchedanu ॥ 2 ॥