షారోను మైదానముతో || Shaaronu Maidhaanamubu Song Lyrics

WhatsApp Group Join Now

Shaaronu Maidhaanamubu Song Lyrics Telugu

షారోను మైదానముతో – సమమైన మైదానంబు
ఏ రాజ్యమందు లేదు – ఎంచిచూడగా

1. ప్రభూ యేసురూపే సంఘ – వధువు ధరియించె నామె
విభవమేమంచు నేను – వివరింపగలను

|| షారోను ||

2. స్వీయరక్తమున ప్రభువు – చిన్ని కన్నియను శుద్ధి
జేయ పావురము వంటి – దాయె స్థిరముగను

|| షారోను ||

3. నిష్పక్ష పాతముతోడ – నిజము చెప్పవలెనన్న
పుష్పవనమిదియెకటియే – పూర్ణార్ధంబున

|| షారోను ||

4. పరమార్ధ కీర్తనంబు – పాడించినదియె యీ
సరసమైన పుష్పాల – షారోను పొలము

|| షారోను ||

5. షారోను పుష్పమువంటి – సంఘవధువునకు క్రీస్తు
ఏరూపమిచ్చెనో నే – నెన్నగలనా

|| షారోను ||

6. నానా వర్ణాల పువ్వుల్ – నరదృష్టి నాకర్షించు
మానవ శుద్ధి ప్రభుని – మదినాకర్షించు

|| షారోను ||

7. సర్వ పుష్పాలయందు – సంఘవధువె పుష్పంబు
ఊర్విని సిద్ధమౌను – ఉండు పరమందు

|| షారోను ||

8. సూర్యుండు పువ్వులకెంతో – సొగసైన రంగులద్దున్
సూర్యుండై నట్టి యేసు – శుభగుణములద్దున్

|| షారోను ||

9. ఆ యద్దకంబు వాడి – అంతర్ధానంబై పోవు
ఈ యద్దకంబు పోదు – ఇది శాశ్వతముండు

|| షారోను ||

10. వివిధ వర్ణములు గల – విశ్వాసులను పుష్పాలు
భువి మీద మొల్చునట్టి – పుష్ప సంఘంబు

|| షారోను ||

11. సభను గురించియునా – ప్రభుని గురించియున్న
శుభవార్త వినుచు చెప్పుచు – సుఖియింపగలను

|| షారోను ||

Shaaronu Maidhaanamubu Song Lyrics English

Shaaronu maidhaanamubu – samaina maidhaanambu
Ee raajyamandu ledu – enchichuudagaa

1. Prabhu Yesurupē Sangha – vadhuvu dhariyinche naamē
Vibhavamēmanchu nēnu – vivarimpagalanu

|| Shaaronu ||

2. Sweeya rakthamuna prabhuvu – chinne kanniyanu shuddhi
Jeya paavuramu vanti – daaye sthiramuganu

|| Shaaronu ||

3. Nishpaksha paathamutho – nijamu cheppavalenan
Pushpavanamidaya katiyē – poornardhambuna

|| Shaaronu ||

4. Paramaartha keerthanambu – paadinchinadhiyē ee
Sarasamaina pushpāla – Shaaronu polamu

|| Shaaronu ||

5. Shaaronu pushpamuvanti – sanga vadhuvunaku Kreesthu
Ē roopamichchenu nē – nennagalana

|| Shaaronu ||

6. Naana varṇaala puvvul – nara drushti naakarshinchu
Maanava shuddhi prabhuni – madinaakarshinchu

|| Shaaronu ||

7. Sarva pushpaalayandu – sanga vadhuve pushpambu
Uurvinidhyamounu – undu paramandu

|| Shaaronu ||

8. Sooryundu puvvulakenno – sogasaina rangula daddunu
Sooryundai natti Yesu – shubhagunamula daddunu

|| Shaaronu ||

9. Aa yaddakambu vaadi – anthardhaanambai pōvu
Ee yaddakambu pōdu – idi shaashvathamundu

|| Shaaronu ||

10. Vividha varṇamulu gala – vishvaasulanu pushpaalu
Bhumi meeda molchunatti – pushpa sangambu

|| Shaaronu ||

11. Sabhanu gurinchiyunaa – prabhuni gurinchiyunn
Shubhavaarthaa vinu cheppachu – sukhiyimpagalanu

|| Shaaronu ||

Leave a Comment