WhatsApp Group
Join Now
Randi Suvaartha Sunaadamutho Lyrics Telugu
రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవ జాతి వికాసం – యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం
||రండి||
2. యేసే దేవుని ప్రేమస్వరూపి – యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం
||రండి||
౩. యేసే సిలువను మోసినదైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్థన సహకారం
||రండి||
4. యేసే సంఘములో మనకాంతి – యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి – పసిపాపల దీవెన మూర్తి
||రండి||
5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికిసూత్రం – వాసిగనమ్మిన జనస్తోత్రం
||రండి||
Randi Suvaartha Sunaadamutho Lyrics English