రక్షకుండుదయించినాడట || Rakshakundu Dayinchinaadata Song Lyrics

WhatsApp Group Join Now

Rakshakundu Dayinchinaadata Song Lyrics Telugu

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము

||రక్షకుండు||

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు

 ||రక్షకుండు||

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త

 ||రక్షకుండు||

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు

 ||రక్షకుండు||

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె

 ||రక్షకుండు||

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు

 ||రక్షకుండు||

Rakshakundu Dayinchinaadata Song Lyrics English

Rakshakundu dayinchinaadata – mana koraku parama
Rakshakundu dayinchinaadata
Rakshakundu dayinchinaadu – raare golla boyalaara
Takshanamuna boyi mana ni – reekshana phala mondedamu

||Rakshakundu||

Daaveedu vamshamandu dhanyudu janminchinaadu (2)
Devudagu Yehovaa mana – dikku deri choochinaadu

||Rakshakundu||

Gaganamu nundi diggi – ghanudu Gaabriyelu dootha (2)
Taginattu cheppe vaariki – migula santoshaa vaartha

||Rakshakundu||

Varthamaanamu jeppi dootha – vaibhavamuna povuchunnaadu (2)
Karthanu joochina venuka – kaanthumu vishramambappudu

||Rakshakundu||

Pashuvula thottilona – bhaasillu vasthramula jutti (2)
Shishuvunu ganugondurani – sheeghramuganu dootha thelpe

||Rakshakundu||

Anuchu golla lokari kokaru – aanavaalu jeppukonuchu (2)
Anumathinchi kadaku Kreesthu – nandarikinee delpinaaru

||Rakshakundu||

Theme

A joyful Telugu Christian Christmas song celebrating the birth of Jesus Christ, the Savior sent by God for mankind. The lyrics beautifully describe the angel Gabriel announcing the good news to the shepherds, who hurried to witness baby Jesus lying in a manger. This traditional carol reminds believers of God’s love, salvation, and the hope brought through Christ’s birth.

Leave a Comment