Rakshaka Naa Vandanaalu Lyrics
రక్షకా నా వందనాలు – శ్రీరక్షకా నా వందనాలు
ధరకు రాకముందె భక్త – పరుల కెరుకైనావు|| రక్షకా ||
ముందు జరుగు నీ చరిత్ర – ముందె వ్రాసిపెట్టినావు|| రక్షకా ||
జరిగినపుడు చూచి ప్రవ – చనము ప్రజలు నమ్మినారు|| రక్షకా ||
నానిమిత్తమై నీవు – నరుడవై పుట్టినావు|| రక్షకా || – (లూకా 2 అ)
మొట్టమొదట సాతాను – మూలమూడ గొట్టినావు|| రక్షకా || – (మత్తయి4:10)
పాపములు పాపముల – ఫలితములు గెలిచినావు|| రక్షకా || – (1పేతురు 2:21-23)
నీవె దిక్కు నరులకంచు – నీతిబోధ చేసినావు|| రక్షకా || – (యోహాను 14:10)
చిక్కుప్రశ్న లాలకించి – చిక్కుల విడదీసినావు|| రక్షకా || – (మత్తయి 22:21)
ఆకలిగలవారలకు – అప్పముల్ కావించినావు|| రక్షకా || – (యోహాను 6:12)
ఆపదలోనున్న వారి – ఆపద తప్పించినావు|| రక్షకా || – (మత్తయి 8:26)
జబ్బుచేత బాధనొందు – జనుని జూడ జాలినీకు|| రక్షకా || – (మత్తయి 9:36)
రోగులను ప్రభావముచే – బాగుచేసి పంపినావు|| రక్షకా || – (మార్కు 5:30)
మందు వాడకుండ జబ్బు – మాన్పి వేయగలవు తండ్రి|| రక్షకా || – ( మార్కు 2:12)
వచ్చినవారందరికి – స్వస్థత దయ చేయుదువు|| రక్షకా || – (మార్కు 1:32,33)
అప్పుడును యిప్పుడును – ఎప్పుడును వైధ్యుడవు|| రక్షకా || – (హెబ్రీ 13:8)
నమ్మలేని వారడిగిన – నమ్మిక గలిగింపగలవు|| రక్షకా || – (మార్కు9:24)
నమ్మగలుగు వారి జబ్బు – నయముచేసి పంపగలవు|| రక్షకా || – (మత్తయి 9:29)
రోగిలోని దయ్యములను – సాగదరిమి వేసినావు|| రక్షకా || – (మత్తయి 17:18)
దయ్యముపట్టినవారి – దయ్యమును దరిమినావు|| రక్షకా || – (మార్కు 5:13)
బ్రతుకు చాలించుకొన్న – మృతులను బ్రతికించినావు|| రక్షకా || – (లూకా 7:15)
పాపులు సుంకరులు ఉన్న – పంక్తిలో భుజించినావు|| రక్షకా || – (లూకా 15:2)
మరల నీవు రాకముందు – గురుతు లుండునన్నావు|| రక్షకా || – (మత్తయి 24 అధ్యా)
చంపుచున్న శత్రువులను – చంపక క్షమించినావు|| రక్షకా || – (లూకా 23:34)
రాకవెన్క అధికమైన – శ్రమలు వచ్చునన్నావు|| రక్షకా || – (మత్తయి 24:21)
క్రూరులు చంపంగ నా – కొరకు మరణమొందినావు|| రక్షకా || – (థెస్స 5:10)
పాపములు పరిహరించు – ప్రాణరక్తమిచ్చినావు|| రక్షకా || – (యోహాను 19:34; మత్తయి 27:50)
పాపభారమెల్లమోసి – బరువు దించివేసినావు|| రక్షకా || – (యెషయి 53 అధ్యా)
వ్యాధిభారమెల్ల మోసి – వ్యాధి దించివేసినావు|| రక్షకా || – (యెషయి 53)
శిక్షభారమెల్లమోసి – శిక్షదించివేసినావు|| రక్షకా || – (యెషయి 53)
మరణమొంది మరణభీతి – మరలకుండ జేసినావు|| రక్షకా || – (హెబ్రీ 2:14)
మరణమున్ జయించిలేచి – తిరిగి బోధజేసినావు|| రక్షకా || – (అపో.కా.1:3)
నిత్యము నాయొద్దనుండ – నిర్ణయించుకొన్నావు|| రక్షకా || – (మత్తయి 28:20)
సృష్టికి బోధించుడని – శిష్యులకు చెప్పినావు|| రక్షకా || – (మార్కు 16:15)
నమ్మి స్నానమొందరక్ష – ణంబు గల్గునన్నావు|| రక్షకా ||
దీవించి శిష్యులను – దేవలోకమేగినావు|| రక్షకా || – ( లూకా 24:51)
నరకము తప్పించి మోక్ష – పురము సిద్ధపరచినావు|| రక్షకా || – (యోహాను 14:3; ప్రకటన 20:14)
మహిమగల బ్రతుకునకు – మాదిరిగా నడచినావు|| రక్షకా || – (యోహాను 8:54; 1పేతురు 2:21)
దేవుడని నీ చరిత్ర – లో వివరము చూపినావు|| రక్షకా || – (యోహాను 20:28; రోమా 9:5)
త్వరగావచ్చి సభను మోక్ష – పురము కొంచుపోయెదవు|| రక్షకా || – (యోహాను 14:3)
నేను చేయలేనివన్ని – నీవె చేసి పెట్టినావు|| రక్షకా || – (1తిమోతి 1:15)
యేసుక్రీస్తు ప్రభువ నిన్ను – యేమని స్తుతింపగలను|| రక్షకా || – (1తిమోతి 1:15)
బైబిలులో నిన్ను నీవు – బయలుపర్చుకొన్నావు|| రక్షకా || – (లూకా 24:44)
భూమిచుట్టు సంచరించు – బోధకులను పంపినావు|| రక్షకా || – (అపో.కా. 1:8)
సర్వదేశాలయందు – సంఘము స్థాపించినావు|| రక్షకా || – (సంఘ చరిత్ర)
అందరకు తీర్పు రాక – ముందే బోధచేసెదవు|| రక్షకా || – (మత్తయి 7:22;ప్రకటన 20:1)