Prema Yesuni Prema Lyrics Telugu
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
||ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును
||ఎన్నడెన్నడు||
భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును
||ఎన్నడెన్నడు||
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును
||ఎన్నడెన్నడు||
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును
||ఎన్నడెన్నడు||
Prema Yesuni Prema Lyrics English
Prema Yesuni prema adi evvaru koluvale nidi
Nijamu dheenini nammu idi bhuvi andhinchaleni dhi
Ennadennadu maaranidhi naa Yesuni divya prema
Ennadennadu veedanidhi naa Yesuni nithya prema
||Prema||
Thallidandhrula prema needha vale gathiyinchunu
Kannabiddhala prema kalalaa karigipovunu
||Ennadennadu||
Bhaarya bharthala madhya vikasinc hina prema pushpamu
Vaadipoyi raalunu thvaralo moodhula migilipovunu
||Ennadennadu||
Bandhumitrula yandhu veluguchunna prema deepamu
Noone unnant kaalam e velugunic hi aaripovunu
||Ennadennadu||
Dharalona prema lanniy u sth iramu kaavu tharigipovunu
Krishthu Yesu kalvari premaa kadavaraku aadarinc hunu
||Ennadennadu||