ప్రభు సంస్కారపు విందు Prabhu samskarapu vindu Song Lyrics

WhatsApp Group Join Now

Prabhu samskarapu vindu Telugu Lyrics

ప్రభు సంస్కారపు విందు – ప్రభు సంస్కారపు విందు
పరుగెత్తుకొని రండి – ప్రభువే మన విందు
ప్రభువు జతకిదే సందు – పాప వ్యాధికి మందు
సభలన్నిటి యందు – సంతుష్టి పెంపొందు || ప్రభు ||

1. అందుకొను రొట్టెతో – ఆయన శరీరము
నందుకొందుము మర్మ మది యద్భుతంబు
యెందరెన్నో మార్లీ – వందల ఏండ్లలో
వందించి తిన్నను – బాధయు తరుగ లేదు || ప్రభు ||

2. అందుకొను రసముతో – ఆయన రక్తము
నందుకొందుము మర్మ – మది యద్భుతంబు
యెందరెన్నో మార్లీ – వందల ఏండ్లలో
వందించి త్రాగినను – బాధయు తరుగ లేదు || ప్రభు ||

3. మన రక్షకుడు దేవ – తనయుండు రండని
కనిపెట్టు చున్నాడు గనుకనే రండి
మనసులోని అడ్డులను – నొత్తిగించి మీ
మనసు ప్రభువునకిచ్చి – వెనుకాడకను రండి || ప్రభు ||

4. పాపాత్ములందరికి – ప్రభువే స్వయంబుగా
బంతి భోజనము యే – ర్పరచి యున్నాడు
పాపు లేక సహవా – సులై యేసుని
దాపున నొక సభగా – ధన్యులౌ విందిదియె || ప్రభు ||

5. పాపి పాపియంచు – ప్రభువు కలవరించు
ప్రభువు ప్రభువని కలవరించు చుండుము
నా పాపి విందునకు – నడచి రాకున్న
నా తాపమెంతో చెప్ప – దగునా యను చున్నాడు || ప్రభు ||

6. భోజన వస్తువులు – భుక్తికి గుర్తులు
భోజన వస్తువులు – ముక్తి భక్తి సాధనములు
రాజు మన తండ్రి ఈ – రాత్రి భోజన కర్త
యే జన విశ్వాసి కిని – యేసును వడ్డించును || ప్రభు ||

7. ఇది మోక్ష మందున – ఇకను జరుగబోవు
వధువు సంఘ వైవా – హికపు విందున్
మదిని జ్ఞప్తికి తెచ్చు – మహిమానందము నిచ్చు
పదిలంబుగ సిద్ధపడుచు రండి రండి || ప్రభు ||

8. ప్రభు భోజనము వలన – పాప పరిహారంబు
ప్రభు భోజనము వలన – స్వస్థ కార్యంబు
ప్రభుని బల్లకు తెల్ల – పావురము లన్నట్టు
శుభ ముతో భక్తులు – శోభిల్లు చుందురు || ప్రభు ||

9. మనము ప్రభుని ముట్టు – కొను భోజన పంక్తి
మనలనాయన ముట్టు – కొను భోజన పంక్తి
మన తండ్రితో యింత – చను వాయెను ఈ
చనువు చనువు మోక్షస్థలము వరకు పెరుగు || ప్రభు ||

10. సరిగా నుండి భోజనము – గైకొనుచున్న
నరకమను రెండవ- మరణము లేదు
మరి కొన్నాళ్ళకు వచ్చు – మరణము పరలోక
పురమునకు ద్వారమై – మరణమని పింపదు || ప్రభు ||

11. రెండవ రాకడ కుండు – వారికి చావు  
ఉండనే ఉండదు – ఉండు జీవంబు
నిండు మహిమ యుండు – నిజ శరీరము దాల్చి
యుండి యెగుర గలము – ఉర్ధ్వ లోకమునకు || ప్రభు ||

12. జనక కుమారాత్మలను – త్రైక దేవుండీది
నమున మనలను – దీవించు చుండు
మన మనసులను బట్టి – జనక త్రైకునకు
దొందు ఘనత మహిమ స్తోత్ర గానముల్ – సత్కీర్తి || ప్రభు ||

Prabhu samskarapu vindu English Lyrics

Prabhu samskarapu vindu Prabhu samskarapu vindu
Parughettukoni randi Prabhuve mana vindu
Prabhuvu jatakide sandu Paapa vyadhiki mandu
Sabhalanniti yandu Santushti pempanandu || Prabhu ||

1. Andukonu rotte to Ayana shareeram u
Nandukondumu marma madi yadbhutambu
Yendarennomarli Vandala eendalalo
Vandinchi tinnan u Baadhayu taruga ledu || Prabhu ||

2. Andukonu rasamuto Ayana raktham u
Nandukondumu marma Madi yadbhutambu
Yendarennomarli Vandala eendalalo
Vandinchi traaginanu Baadhayu taruga ledu || Prabhu ||

3. Mana rakshakudu deva Tanayundu randani
Kanipettu chunnaadu Ganukane randi
Manasuloni addulu Nottiginchi mii
Manasu prabhuvunakicchi Venukaadakanu randi || Prabhu ||

4. Paapaatmulandariki Prabhuve svayambugaa
Banti bhojanamu ye Rparachi yunnaadu
Paapu leka sahavaa Sulai yesuni
Daapuna noka sabhagaa Dhanyulau vindidiye || Prabhu ||

5. Paapi paapiyanchu Prabhuvu kalavarinchu
Prabhuvu prabhuvani kalavarinchu chundumu
Naa paapi vindunaku Nadachi raakunna
Naa thaapamento cheppa Dagu naa yanu chunnaadu || Prabhu ||

6. Bhojana vastuvulu Bhuktiki gurtulu
Bhojana vastuvulu Mukti bhakti saadhanamulu
Raaju mana tandri ii Raatri bhojana karta
Ye jana vishwaasi kini Yesunu vaddinchunu || Prabhu ||

7. Idi moksha manduna Ikanu jarugabovu
Vadhuvu sanga vaivaha Hikapu vindun
Madini jnnapthiki tecchu Mahimaanandamu nichchu
Padilambuga siddhapaduchu randi randi || Prabhu ||

8. Prabhu bhojanamu valana Paapa pariharaambu
Prabhu bhojanamu valana Svastha kaaryambu
Prabhuni ballaku tella Paavuramu lannattu
Shubha muto bhakthulu Shobhillu chunduru || Prabhu ||

9. Manamu prabhuni muttu Konu bhojana pankthi
Manalanaayana muttu Konu bhojana pankthi
Mana tandritho yinta Chanu vaayenu ii
Chanuvu chanuvu mokshasthalamu varaku perugu || Prabhu ||

10. Sarigaa nundi bhojanamu Gaikonuchunna
Narakamanu rendava Maranamu ledu
Mari konnaalaaku vacchu Maranamu paraloka
Puramunaku dhvaaramai Maranamani pinpadu || Prabhu ||

11. Rendavaraakada kundu Vaariki chaavu
Undane undadu Undu jeevaambu
Nindu mahima yundu Nija shareeramu daalchi
Yundi yegura galamu Urdhva lokamunaku || Prabhu ||

12. Janakakumaaraathmalanu Traika devundeedi
Namuna manalu Dheevinchu chundu
Mana masulunu batti Janaka thraikunaku
Dondhu ghnatha mahima sthothra gaanamul Satkeerthi || Prabhu ||

Prabhu samskarapu vindu Video

Leave a Comment