పావురమా పరలోక జీవమునిచ్చిన || Pavuramaa Paraloka Song Lyrics

WhatsApp Group Join Now

Pavuramaa Paraloka Song Lyrics Telugu

పావురమా – పరలోక – జీవమునిచ్చిన పావురమా
నిత్యజీవము నిచ్చిన – పావురమా

||పా||

అనాది నుండిన ఓ పావురమా – పునాది వేసితి విభువికి
వినోదమైన సృష్టినిచేసి – జనాంగముల కప్పగించితివా

||పా||

జ్ఞానము నిచ్చెడి పావురమా – దానమునిచ్చెడి పావురమా
గానము చేసెద ఓ పావురమా – పావనునిగ జేసెడి పావురమా

||పా||

వరముల నొసగెడి ఓ పావురమా – స్వరముతో బిలిచెడి పావురమా
నిరతము నీ సన్నిధిలో నుండిన – కొరతలు దీర్చెడి పావురమా

||పా||

పొదలో నుండిన ఓ పావురమా – నదిలో నుండిన పావురమా
గుడిలో నుండిన ఓ పావురమా – హృదిలో నుండి మది వెలిగించుము

||పా||

బైబిలులో ప్రవక్తల నెల్ల – బలముగా నడిపిన పావురమా
విభజించితివి లోకమునుండి – బలపరచిన ఓ పావురమా

||పా||

గదిలో నిండిన పావురమా – సన్నిధిలో నిండిన పావురమా
షారోను సన్నిధి సరిచేసితివి – సమస్త మహిమలు పొందితిని

||పా||

జనక సుతాత్మల ఘనదేవుండా – వినయముతో స్తుతి జేసెదము
మనసున స్తుతిచేసెద పావురమా – ఘనతయు నీకే కలుగునుగాక

||పా||

Pavuramaa Paraloka Song Lyrics English

 Pavuramaa – paraloka – jeevamunichina pavuramaa

Nityajeevamu nichina – pavuramaa

||Paa||

Anaadi nundina O pavuramaa – punadi vesiti vibhuviki
Vinodamaina srushtiniches i – janaangamula kappaginchitivaa

||Paa||
Gnanamu nichedi pavuramaa – daanamunichedi pavuramaa
Gaanamu cheseda O pavuramaa – pavanuniga jasedi pavuramaa

||Paa||

Varamula nosagedi O pavuramaa – swaramuto bilichedi pavuramaa
Niratamu nee sannidhilo nundina – koratalu deerchedi pavuramaa

||Paa||

Podalo nundina O pavuramaa – nadilo nundina pavuramaa
Gudilo nundina O pavuramaa – hrudilo nundi madi veliginchumu

||Paa||

Biblelo pravakthala nella – balamuga nadipina pavuramaa
Vibhajinchitivi lokamunundi – balaparachina O pavuramaa

||Paa||

Gadilo nindina pavuramaa – sannidhilo nindina pavuramaa
Sharonu sannidhi sarichesitivi – samasta mahimalu ponditini

||Paa||

Janaka sutaathmala ghanadevunda – vinayamuto stuti chesedamu
Manasuna stuticheseda pavuramaa – ghanatayu neeke kalugunugaka

||Paa||

Theme

This song is a Holy Spirit hymn that praises the dove as a symbol of life, wisdom, gifts, guidance, and God’s presence. It speaks about the Spirit’s work in creation, in the Bible, in believers’ hearts, and in worship, ending with a prayer that all glory belongs to God.

Leave a Comment