Paapa Vruththini Maanukonumee Lyrics Telugu
పాప వృత్తిని మానుకొనుమీ – మనసా
శాపాలు నరకంబు సహింపలేవు
|| పాప ||
ఎంత పాపమైన – ఎట్టి పాపమైన
అంతయు దేవుని కవగాహనంబె
|| పాప ||
అనుకొన్న పాపాలు – అన్ని దేవుని కెరుకే
పనిగట్టుకొని మానవలెను మరువకుమి
|| పాప ||
నీవాడు ప్రతి మాట – నీవు మరతువు గాని
దేవుండు మరచునా తీర్పుండు సుమ్ము
|| పాప ||
కాని మాటలు లేని – పోని మాటలు నీకు
హాని తెచ్చును అవమానంబు గలుగు
|| పాప ||
దేవుని విడిచియు – దేవుండు చేసిన
ఏ వస్తువునైన ఎంచి మ్రొక్కకుము
|| పాప ||
కష్టాలలో – సృష్టికర్తపై విసుగకు
నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు
|| పాప ||
ఆరాధన దినంబు – ఆచరింపగ వలయు
ఏ రోజు కన్నను ఈ రోజే గొప్ప
|| పాప ||
తల్లి దండ్రులన్ మర్యాద – దస్తులన్ పెద్దలన్
నిలదీర్గాయువు గల్గనెంచు ఘనముగను
|| పాప ||
కల్లు సారా బ్రాంది! ఇల్లు నొడల గుల్ల
తల్లి పిల్లలు నీవు దారిద్ర్యము పాలు
|| పాప ||
తిట్టులాడుట తుదకు – కొట్టులాడుట యగును
ఇట్టి మాదిరి పిల్లల కెట్టి మాదిరియౌ
|| పాప ||
యౌవనేచ్చలు పరిహారంబు చేయుడి
భావ శుద్ధి గడింప బ్రతుకు వర్ధిల్లు
|| పాప ||
దొంగ బుద్ధి చెరకు – త్రొవ జూపును నీకు
అంగీకరింపరు ఆత్మ బంధువులె
|| పాప ||
పాపాలన్ గెల్చిన – ప్రభు యేసు నడిగిన
పాపాల నోడించు బలమిచ్చు నీకు
|| పాప ||
పడుచు వారలారా! – పడుచు వారిని జూచి
చెడు బుద్ధులను మీలో చేరనీయకుడి
|| పాప ||
Paapa Vruththini Maanukonumee – Manasaa
Shaapaalu Narakaambu Sahinpaleyvu
|| Paapa ||
Enta Paapamaina – Ett i Paapamaina
Antayu Devuni Kavagaahanambe
|| Paapa ||
Anukonna Paapaalu – Anni Devuni Kerukey
Panigattukoni Maanavalenu Maruvakumi
|| Paapa ||
Neevaadu Prathi Maata – Neevu Marathuvu Gaani
Devundu Marachunaa Theerpuundu Summu
|| Paapa ||
Kaani Maatalu Leyni – Poni Maatalu Neevu
Haani Techchunu Aavamanaambu Galugu
|| Paapa ||
Devuni Vidichiyu – Devundu Chesina
Ee Vastuvunaina Enchi Mrokkakumu
|| Paapa ||
Kashtaallalo – Srushtikarthapai Visugaku
Nashtaallalo Prabhuni Nammi Kanipettu
|| Paapa ||
Aaraadhana Dinambu – Aacharimpa gavalayu
Ee Rojukannanu Ee Rojey Goppa
|| Paapa ||
Talli Dandhrulana Maryaada – Dasthulana Peddhalana
Niladheerghaayuvu Galganenchu Ghanamuganu
|| Paapa ||
Kallu Saaraa Braandi! Illu Nodalagulla
Talli Pillalu Neevu Dhaarithryamu Paalu
|| Paapa ||
Tittulaadut Thudaku – Kottulaadut Yagunu
Itt i Maadiri Pillala Ketti Maadiri yaou
|| Paapa ||
Yauvanecchalu Pari – Haaranambu Cheyud i
Bhaava Shuddhi Gadinpa Br athuku Vardhillu
|| Paapa ||
Dongabuddhi Cheraku – Throva Joopunu Neevu
Angheekarinparu Aathma Bandhuvule
|| Paapa ||
Paapaalan Gelchina – Prabhu Yesu Nadigina
Paapaala Nodinchu Balamichchu Neeku
|| Paapa ||
Paduchu Vaaralaaara! – Paduchu Vaarini Jochi
Chedu Buddulanu Mee lo Chaerna Neeyakudi
|| Paapa ||