ఊహకందని ప్రేమలోని బావమే నీవు || Oohakandani Prema Song Lyrics

WhatsApp Group Join Now

Oohakandani Prema Song Lyrics Telugu

ఊహకందని ప్రేమలోని బావమే నీవు
హృదయమందు పరవసించు గానమే నీవు
మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులే నీవు
ఎడబాయలేనన్న నిజస్నేహమే నీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు

తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి
తనువుతీరే వరకు నన్ను విడువలేనంది
అదియే… నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చినప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయె
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయె

నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా
అదియే… తన మహిమ విడినత్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి

దేహమందు గాయమైతే కుదుటపడును కదా
గుండెగాయము గురుతుపట్టిన నరుడులేడు కదా
నీవే నీవే యేసయ్యా… నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు
నను భుజముపైన మోసిన అలసిపోనీ ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటు లేనే లేదయ

 

Oohakandani Prema Song Lyrics English 

Oohakandani premaloni bavame neevu
Hrudayamandu paravasinchu gaaname neevu
Manassu nindina ramyamaina gamyame neevu
Marapurani kalala saudham gurutule neevu
Edabayalennanija snehame neevu
Nee prema kaugililo aanandame neevu

Talladille tallikanna minchi preminchi
Tanuvutire varaku nannu viduvaleanandi
Adhiye… ne gaayaparachina velalo kanniru kaarchina premaga
Nulivechanaina odiki cheerchi aadarichina prema ye
Nee gundelo nanu cheerchina nee amaramaina prema ye

Ningi nelanu kalipina balamaina vaaradhiga
Nelakorigna jeevitaniki levanetthenu ga
Adhiye… thana mahima vidinatyagam u
Ee bhuviki vachchina bhagyamu
Nan daatiponka vedakina nee madhuramaina prema ye
Nee sarvamichchina daatavu nanu hattukunna swaami vi

Dehamandu gaayamaithe kudutapadunu kada
Gundegaayamu gurutupattina naruledu kada
Neeye neeye Yesayya… na antarangamu tarachi choosina gaadhamaina prema vu
Nanu bhujamupaina mosina alasinoni prema vu
Neevu lenaidhe naa brathukulo viluvantu lenaayya

Leave a Comment