WhatsApp Group
Join Now
Oda Velli Povuchunnadi Lyrics Telugu
ఓడ వెళ్ళి పోవుచున్నది – ఆ పరమ గురుని
ప్రాపకుని దరిజేరునట్టి
1. శృంగారమైనట్టి – బంగారు కిటికీలు – రంగుమీరగ
పంపు రమణీయంపురాజోయ్
2. ఓడలో నెవరైనా-యెక్కుదురేమోయని సిలువ
జెండానెత్తి – పిలుచుచున్నాడండోయ్
3. పరమతండ్రి నాయకుడు – పరిశుద్ధాత్మ చక్కాని
ప్రభుయేసూ ఈ ఓడ పరుగెత్తరండోయ్
4. నమ్మి స్నానంబొందు – గుమ్మమిరికే కదా
సమ్మతించినవారికి-సరిపోవు నీఓడ
5. యేసు నామంబనెడి – టిక్కెట్టు గలదండో
టిక్కెట్టు లేకుండా-ఎక్కలేమీ ఓడ
6. ప్రవాహ శోధనలకు – పారిపోదీ ఓడ
ప్రార్ధనను లంగరు – ప్రక్కనున్నదిగా
7. గాలి తుఫానులకు – తేలిపోదీ నావ
గాలిని గద్దించే-ఘనుడే సేనండోయ్
8. ఎక్కిన ప్రజలను – చక్క చేయుచు ఓడ
పెక్కు కలాసులనెడి – బోధకులు గలరు
9. నట్టనడుమ దీని – మెట్ట పల్లము తెల్పు – నట్టి
బైబిలనెడి-జాబొకటి కలదు
Oda Velli Povuchunnadi Lyrics English