నేనును నా యింటివారును || Nenunu Naa Intivarunu Lyrics

WhatsApp Group Join Now

Nenunu Naa Intivarunu Lyrics Telugu

పల్లవి: నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము
దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము

||నేను||

చరణం 1: అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము
అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో

||నేను||

చరణం 2: వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము
ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము

||నేను||

చరణం 3: ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము
మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము

||నేను||

చరణం 4: సంఘ కార్యక్రమములందు సహకరింతుము
ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము

||నేను||

చరణం 5: ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము
క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము

||నేను||

చరణం 6: శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము
భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము

||నేను||

చరణం 7: చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును
అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము

||నేను||

చరణం 8: పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము
శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు

||నేను||

చరణం 9: జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము
దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము

||నేను||

Nenunu Naa Intivarunu Lyrics English

Nenunu naa intivarunu neethi sooryuni golutum
Deenamanasunu galigi devuni divya sevanu jetum

Anudinambunu prabhuni dalachu alayakanu prarthintum
Anavarata maa prabhuni chittamu nana karintum panulalo

Vedavaakya pathanamandu visugu jendaka numdum
Aadam buna daiva chittamu nana sarichu nadutum

Ashatha adanu prabhuni dinamunu aacharintum
Maruvaka visugu jendaka naalayamunaku pina piddala dettaum

Sangha karyakramamulandu sahakarintum
Pratitho bhaṅga parachedi panulan nithi kriyangedam anishamu

Premathoda porugu varini priyulgana bhaavintum
Kshamayu snehamu nerdchi prabhukada shanthitho jeevintum

Shakthi goladi shareerabalamunu shamnamu krishthuku nithum
Bhaktitho hridayamunu poorthigaa prabhunikē arphintum

Chinnavaralu daiva rajyapu chirutha varasulananchunu
Annivela vali vridhiki minnaga dodpadedamu

Peddavaralu daivajanulanai permito bhaavintum
Shuddhudagu prabhu krishthu manasunu Shraddhathoda joopuchu

Jeevithambunu prabhuni premashishulani prasarintum
Divyajyothulu reethi veluguchu divyasannidhi numdum

Leave a Comment