WhatsApp Group
Join Now
Neeku Emi Ivvagalanu Lyrics Telugu
నీకు ఏమి ఇవ్వగలను – లోక స్రష్ట ప్రియుడా! జనకా!
నాకు జీవాళికి ఏ కొదువ – లేకుండ దయచేయుమో దేవా || నీకు ||
1. నాకు నీ విచ్చినవే మరల – నీకు చందగా వేసెదను
ప్రాకట ముగా నీ యీవులకై – వందనము లర్పింతును తండ్రి || నీకు ||
2. నీ కుమారునిన్ నా కొసగి – నిత్య రక్షణను గల్గించి
లౌకికులకు లేని మోక్ష – లోక భాగ్య మిచ్చినావు || నీకు ||
3. జీవమును నా జీవంబునకై – సిల్వపై నర్పించిన యేసు
దేవ నేను నీ ఋణంబు – దీర్ప గలనా ఎన్నటికైన || నీకు ||
4. ఎందుచేత ఈ పాపి పై – ఇంత ప్రేమ యుండగలదో
డెందము గ్రహింప లేదు – వందన మిమ్మానుయేలా || నీకు ||
5. దాన శక్తినిమ్ము నాకు – దైవాత్మ మోక్ష పావురమా!
మానవ భక్తాళికెల్ల – మంచి వరము లిచ్చు నాధా || నీకు ||
6. తనువంతటి నీ కిచ్చివేయు ధర్మ గుణము దయ చేయుము
పనికి వచ్చినట్లు నన్ నీ – పనికి వాడుకొమ్ము తండ్రి || నీకు ||
Neeku Emi Ivvagalanu Lyrics English
Neeku emi ivvagalanu – Loka srashta priyuda! Janaka!
Naaku jeevaaliki e koduva – leykunda daya cheyumoo deva || Neeku ||