నీ సన్నిధి కోరునట్టి || Nee Sannidhi Korunatti Lyrics

WhatsApp Group Join Now

Nee Sannidhi Korunatti Lyrics Telugu

 నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు
నీ సన్నిధి కల్గియున్న ఆ నరుడే ధన్యుడు

పాపములను పడగొట్టును – నీ పాద సన్నిధి
శాపములను హరించును – శక్తి గల్గిన సన్నిధి

చిక్కులను విడగొట్టును – నీ పాద సన్నిధి
చింతలను దీర్చునది – చిత్రమైన సన్నిధి

వ్యాధులను పోగొట్టును – నీ పాదసన్నిధి
బాధలను బాపి తుదకు – మోదమిచ్చు సన్నిధి

రణములను రద్దుపరచు – నీ పాదసన్నిధి
రణములను మార్చునది – రమ్యమైన సన్నిధి

పడకుండా చేయునది – నీ పాద సన్నిధి
నిరతము నడిపించునది – నీ దివ్య సన్నిధి

మచ్చలను మాన్పునది – నీ పాదసన్నిధి
ముడతలను సరిచేయును – ముచ్చటైన సన్నిధి

అపవాది తంత్రములను – లయపర్చు నీ సన్నిధి
పాతాళ బంధకములు – త్రెంపివేయు సన్నిధి

ఆరోహణ బలమిచ్చును – నీ పాద సన్నిధి
అవరోహణ అంతస్థును – అంతరించు నీ సన్నిధి

పాపనైజము మార్చును – శ్రీయేసుని సన్నిధి
అసాధ్యమైన కార్యములను – సరిచేయు నీ సన్నిధి

అల్ఫాయు ఓ మెగాయునైన – ఆ యేసుని సన్నిధి
ముఖాముఖిగా మాట్లాడును – ఆశ్చర్య సన్నిధి 

Nee Sannidhi Korunatti Lyrics English

Nee sannidhi korunatti maanavude dhanyudu
Nee sannidhi kalgi yunna naarude dhanyudu

Paapamulanu padagottunu — nee paada sannidhi
Shaapamulanu harichchunu — shakthi galgina sannidhi

Chikkulanu vidagottunu — nee paada sannidhi
Chintalanu deerchunadi — chitramainaa sannidhi

Vyaadhulanu pogottunu — nee paada sannidhi
Baadhalanu baapi thudaku — modamichchu sannidhi

Ranamulanu raddhuparachu — nee paada sannidhi
Ranamulanu marchunadi — ramyamainaa sannidhi

Padakunda cheyunu — nee paada sannidhi
Niratamu nadipinchunadi — nee divya sannidhi

Machchalu maanpunadi — nee paada sannidhi
Mudathalanu saricheyyunu — muchchatai nna sannidhi

Apavaadi tantramulanu — layaparchu nee sannidhi
Paataala bandhakamu lu — trempiveyu sannidhi

Aarohana balamichchunu — nee paada sannidhi
AvarohaNa anthasthunu — antharinchu nee sannidhi

Paapanaijamu marchunu — Sri Yesuni sannidhi
Asaadhyamainaa kaaryamulanu — saricheyyu nee paada sannidhi

Alphayu o megayu naina — aa Yesuni sannidhi
Mukhamukhi gaa maatladunu — aascharya sannidhi

Leave a Comment