Nalo Emi Choochi Neevu Lyrics

WhatsApp Group Join Now
Nalo Emi Choochi Neevu Lyrics Telugu
నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు ||2||
మర్తమైన లోకమందు నిత్యమైన కృపను చూపి ||2||
నేటి వరకు తోడుండినావు
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ||2||
||నాలో ఏమి||

నా తల్లి గర్భమునే నను కోరినావు –
విశ్వాస గృహములో నను చేర్చినావు ||2||
అమృత జలమైన నీ నోటి మాటలతో –
నిఖిల జగతికి నను పంపినావు
ప్రకటింప నీ చరితం – నా జన్మ నిజ ఫలితం ||2||
||నాలో ఏమి||

ఘనులైన వారే నీ ఎదుట నున్నను –
బలమైన వారే ఎందరో ఉన్నను ||2||
కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో –
నా స్థితిని చూచి నను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా – కడవరకు నీ సాక్షిగా ||2||
||నాలో ఏమి||

ప్రేమానురాగం నీ సంస్క్రృతియే –
కరుణ కటాక్షము నీ గుణ సంపదయే ||2||
నలిగిన రెళ్ళును విరువని వాడా –
చితికిన బ్రతుకును విడువని వాడా
నేనంటే నీకేందుకో ఈ తగని మమకారము ||2||
||నాలో ఏమి||

దవళవర్ణుడవు రత్నవర్ణుడవు –
వర్ణణకందని అతిసుందరుడవు ||2||
ఇరువది నలుగురు పెద్దల మద్యలో –
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా ||2||
నా స్తుతి నీకేనయ్యా పరిశుద్దుడా యేసయ్యా –
నా స్తుతి నీకేనయ్యా నజరేయుడా యేసయ్యా –
నా స్తుతి నీకేనయ్యా ఆరాధ్యుడా యేసయ్యా ||2||
||నాలో ఏమి||

Nalo Emi Choochi Neevu Lyrics English

Chorus:
Nalo emi chuchi nivu inta prema chupinava ||2||
Martamaina lokamandu nityamaina krupanu chupi ||2||
Neti varaku todundinavu
Yesayya yesayya na yesayya ||2||

||Nalo emi||

Na talli garbhame nanu korinava –
Visvasa grhamulo nanu cherchinava ||2||
Amruta jalamaina ni noti matalato –
Nikila jagatiki nanu pampinava
Prakatinpa ni charitam – na janma nija phalitam ||2||

||Nalo emi||

Ghanulaina vare ni eduta nunnanu –
Blamaina vare endaro unnaru ||2||
Kannillu kadalilo sramala sudulalo –
Na sthitin chuchi nanu cheradisi
Marcitivi ni patrikaga – kadavaruku ni sakshigaga ||2||

||Nalo emi||

Premanuragam ni sanskritiye –
Karuna kataksham ni guna sampadaye ||2||
Naligina rellunu viruvani vada –
Chitukina brathukunu viduvani vada
Nenante nikeenduko ee tagani mamakaramu ||2||

||Nalo emi||

Davala varnudavu ratna varnudavu –
Varnanakandani ati sundarudavu ||2||
Iruvadi nalugu peddala madhyalo –
Mahima prabhavamuto simhasanamupai
Asinuda yesayya na stuti nikenayya ||2||
Na stuti nikenayya parishuddhuda yesayya –
Na stuti nikenayya nazareyuda yesayya –
Na stuti nikenayya aradhyuda yesayya ||2||

||Nalo emi||

Leave a Comment