నాకేమి కొదువ నాధుడుండ || Naakemi Kodhuva Naadhudunda Lyrics

WhatsApp Group Join Now

Naakemi Kodhuva Naadhudunda Lyrics Telugu

నాకేమి కొదువ – నాధుడుండ – ఇక =
శ్రీకరుండగు దేవుడే – నా శ్రేష్ట పాలకుడు – నా – యేక రక్షకుడు గనుక

|| నాకేమి || 

1. ఎన్నటికైన – ఎండనట్టి – ఇక =
సన్న పచ్చిక వంటి తరుగని – సదుపాయం బుల్ – నా – కెన్నో చేయున్ గనుక

|| నాకేమి || 

2. తనివి తీరన్ మేళ్ళనుభవింప – నేను =
నను సదా మేళ్ళనెడి పచ్చిక నదిమి మృధువుగ – పండు – కొనజేయును గనుక

|| నాకేమి || 

3. శోధన – యెండయున్న – నాకు =
ఎంతకు న్నోరిగర దెపుడు శాంత జలములు – నా చెంతనే యుండున్ గనుక

|| నాకేమి || 

4. తప్పిపోయిన నన్ – దారింబెట్టి – నన్ను =
తెప్పరిల్ల చేసి నాకు – తీర్చు నలసటను – నా తప్పు మన్నించున్ గనుక

|| నాకేమి || 

5. నీతి మార్గమునన్ నిల్పును నన్ను – ప్రభువు =
నీతిలేని నాకు తన సు – నీతి దయ చేయున్ స్వ – నీతిని ద్రుంచున్ గనుక

|| నాకేమి || 

6. చావు చీకట్ల – శక్తి యుండు – ఆహా =
లోయలోబడి పోవలసినను – నే వెరవకుండ – నా దేవుడే తోడు గనుక

|| నాకేమి || 

7. కష్టంబులను చీ – కటి లోయలో – ఇక =
స్పష్టముగ ఘన సౌఖ్యమును నా దృష్టికింజూపి – నా – నష్టముల్ దీర్చున్ గనుక

|| నాకేమి || 

8. మీద పడునట్టి – శోధనలన్ = నా దరికి రానీక దండము –
నన్ను లాగుచును – నా – కాధరణ యౌను గనుక

|| నాకేమి ||

9. పగవారల్ సిగ్గు – పడునట్లుగా – నా =
జగతి యెరుగని – సౌఖ్య భో – జన మగుపరచుచున్ – హా – తగినదే పెట్టున్ గనుక

|| నాకేమి || 

10. తన యాత్మనంద – తైలంబుతో – ప్రభువు =
అనుదినము తలయంటి విసుగ – కొనక తుడుచును – నా – కను నీళ్ళన్ని గనుక

|| నాకేమి || 

11. పలువిధములైన – భాగ్యములతో – తండ్రి =
వెలుపలికి దిగ – వెడలు నట్టి వెలగల గిన్నె – నా కలిమిగా జేయున్ గనుక

|| నాకేమి || 

12. బ్రతుకంతటన్ కృ – పా క్షేమములు – నా =
వదలకుండగ వచ్చు నాతో – సుదినములు గల్గు – నా – పదలు సంపదలౌ గనుక

|| నాకేమి || 

13. దురితంబులుండు – ధరణి నాకు – నిజము =
నిరవు కాదిక – నెప్పటికి నా – పరమ దేవుని – మం – దిరమె నా యిల్లు గనుక

|| నాకేమి || 

రెండవ భాగము

14. కావలసినవెల్ల – కనబడ గలవు – మనకు =
ఏవియడిగిన – వాని నిచ్చి వేయును తండ్రి – ఇచ్చి

|| నాకేమి || 

15. ధన సహాయంబు – మనకు గల్గు – నేడు =
అనుదినంబు – తండ్రి మనకు అక్కరలు తీర్చు – మన

|| నాకేమి || 

16. బస యేర్పాటులు మా – ప్రభువే చేయున్ – నా =
బస దిగిన స్థలమందు మా – ప్రభువె నివసించున్ – మా

|| నాకేమి || 

17. ప్రభువు దూతలును – పరిశుద్ధులున్ – ఇక =
విభవముగ మన మధ్య – మసలుచు వెల్గు చుందురుగా – హా

|| నాకేమి || 

18. జనకుని యిష్ట – జనము వచ్చు ఇక =
తనకు యిష్టము గాని జనమును దరికి రానీయడు – ఈ

|| నాకేమి || 

19. మా మిత్రులైన – మహిమ దూతలే – ఇక =
క్షేమమునకై మాచుట్టు – చేరి కాయుదురు – చుట్టు

|| నాకేమి || 

20. అందరు మేళ్ళు – అనుభవింప – ఇపుడు =
విందుగా సమకూడు వార్తలు వినిపించును – తండ్రి

|| నాకేమి ||

 21. ప్రభుని శరీర – రక్తములు – నా =

ఉభయ జీవితములకు – మేలై ఉండును – నాకు

|| నాకేమి ||

22. నైజ పాపములు – నశియించుటకే – మన =
భోజనము వడ్డించును – రాజేస్ వయముగా – దేవ

|| నాకేమి ||

23. నీ మనసు లోనివి – నెరవేరును – ఇక =
క్షేమముగనే ఉండవలయు – చింత లేకుండ – నీవు – చింత లేకుండ – గనుక

|| నాకేమి ||

24. నాకు నాతండ్రి – నరరూపముతో – ఇక =
త్రైకుని రీతిగ కనబడి – ధైర్య మిచ్చును – నాకు – ధైర్యమిచ్చును – గనుక

|| నాకేమి ||

25. జనక సుతాత్మ – లను దేవుడు – ఇక =
ఘనముగా యుగములన్నిట వినుతు లొందును – నేనా – యన గొర్రెనే గనుక

|| నాకేమి ||

Leave a Comment