Mitruda Ra Rammu Lyrics Telugu
మిత్రుడా రా రమ్ము – మైత్రితో పార – మార్ధికమైన
– మాటల్ వచింతు – మన్ననతో విను
|| మిత్రు ||
1. పూర్వ జన్మము నందు – పూర్తిగా పాపిని అందుకె యీ బాధ –
పొందుచున్నాను – అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు –
అది నిజమే యైన – అదికూడ పోగొట్టు రక్షకుడున్నాడు – తత్ క్షణమె
రమ్ము – ఆయన మానవుడైనట్టి దేవుండు ఈ మాట నమ్మిన – ఎంత
ధన్యుండవు = మనస్సులో ముద్రించు – కొని శాంతి పొందుము
|| మిత్రు ||
2. ఈ జన్మమున గూడ – ఎన్నెన్నో పాపాలు చేసి యున్నందున – చివరకు
నరకంబె అని ఆత్మ యందున – ఆలోచనెందుకు అవి సిల్వపై యేసు
అంతరింప జేసె ఆ వృత్తాంతంబును – ఆనందముగ నమ్మి
సుఖముగ నుండుము – సూక్ష్మ మార్గంబిది ఎంద రెన్నియన్న
– ఏ మాటల్ వినవద్దు = దేవ వాక్కే నిజము – దిక్కులు చూడకు
|| మిత్రు ||
3. తల్లిదండ్రుల్ చేసిన – తగని కార్యంబులు నామీదికె పొర్లి – నను
జంపుచున్నవి ఆ శాపమును నేను – అడ్డగింపలేను అని పల్కుచును
నీవు – అదరి పోకూడదు పాపమని తెలియని – పాపాలు ఎన్నెన్నో
చేయబట్టి యిన్ని – చిక్కులు నను జుట్టె అని లేని పోనట్టి
వనుకొన కుండుము = నీ పాపముల కంటె – నీ తండ్రి దయ గొప్ప
|| మిత్రు ||
4. నీ పాప శాపాలు – నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ – యేసు
దేవుడు ముందె నీ కీడు పోగొట్టి – నీ కెన్నియో మేళ్ళు సంపాదనము
చేసె – సర్వోప కారుండు దేవుండు మానవుడు – దివిలోన భువిలోన
నినుబట్టి పాపివి – నిను జూడనే వద్దు ప్రభు యేసుని బట్టి – పరిశుద్ధు
డవు నీవు = ఆయనను జూచిన – అంతయు సరియౌను
|| మిత్రు ||
5. ఇంటిలోని పోరు – ఇంకి పోవునుగాక – వాదాలు బేదాలు – వాడి
పోవునుగాక కలహాలు నీటను – కలిసి పోవునుగాక యుద్ధాలు క్రమముగ
ఉడిగి పోవును గాక – అన్ని పాపాలును అంతరించును గాక – సర్వ
దేశములందు – శాంతి కలుగును గాక నాగరికత ప్రతి – నరుని
కబ్బునుగాక దేవుని మ్రొక్కుట – తేజరిల్లును గాక ఆయన బోధలే –
అలుము కొనును గాక ప్రజలందరికిని దైవ – భక్తి పెరుగునుగాక
మంచి జీవిని – కనికరించు చుందురు గాక పాడిపంటలు ప్రతి – వాని
కుండును గాక వెలుగు, నీరు, గాలి – కలుగజేసిన తండ్రి = మన
యందరి వలన – ఘనత నొందునుగాక!
|| మిత్రు ||
6. దివ్య దేవుడు నిన్ను – దీవించును గాక భూమి చేసిన వాడు – పోషిం
చును గాక రక్షకుండౌ క్రీస్తు – రక్షించును గాక పరమ వైధ్యుడు స్వస్థ
పరచు చుండును గాక పనులన్నిటిని – సఫల – పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు – తెచ్చు చుండును గాక అంతాన మోక్షంబు –
అందజేయును గాక = విజయము ఈ పాట – వినువారికామెన్
|| మిత్రు ||