మనో విచారము కూడదు నీకు || Mano Vichaaramu Koodhadhu Lyrics

WhatsApp Group Join Now

Mano Vichaaramu Koodhadhu Lyrics Telugu

మనో విచారము కూడదు నీకు – మహిమ తలంపులె కావలెను
= దిన క్రమాన శాంతి గుణంబులు – దీనులకిచ్చు చుందును

|| మనో ||

ఆలస్యమైనంత మాత్రమున – అవి నెరవేర వనవద్దు
= కాలము పరిపూర్ణంబు కాగా – ఖచ్చితముగ – అన్నియు నెరవేరును

|| మనో ||

నిత్యానందము సత్యానందము – నీలో నే నమర్చితి
= అత్యానందము అగపడు చుండును – ఆలోచించు చున్న కొలది

|| మనో ||

కోరవు నీకు కావలసినవి – ఊరకనె నీకిచ్చెదను
= ధారళముగ నిచ్చుటకు నా ధన నిధి – వస్తువు లన్నియు గలవు

|| మనో ||

నీరస పడకుము నీరస పడకుము – నీవె నా ఆస్తి గదా
= నా రక్తముతో సంపాదించితి – నన్ను నీ ఆస్తిగ గైకొనుము

|| మనో ||

ఆనంద తైలముతో నిన్ను – అభిషేకించి యున్నాను
= స్నానము ప్రభు భోజనము ప్రజలకు – జరుపుట సరియని అనుచున్నాను

|| మనో ||

నీకు కావలసినవి అడుగుము – నేను తప్పక ఇచ్చెదను
= నీకు ఇచ్చుట నాకానందము – నీవు అడుగుట ముచ్చట నాకు

|| మనో ||

నీ కష్టములు నీ కోరికలు నాకెరుకె అవి యుండవుగా
= లేకుండగ జేసెదను అప్పుడు – లేడివలె గంతులు వేయుదువు

|| మనో ||

నీ కవసరమైనవి కావలసిన – నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును
= కాకుల కాజ్ఞ యిచ్చి ఏలి – యాకు ఆకలి తీర్చలేదా

|| మనో ||

సైకిళ్ళు, స్టీమర్లు, బండ్లు – సంచారమునకు అవసరమా?
= లోకులు కోరిన యెడల అవియు – నీకవి సుళువుగ లభియించు

|| మనో ||

ఎండయు, చలియు, వానయు, గాలియు – ఏమియు చేయ నేరవు నిన్ను
= తిండికి – బట్టకు, బసకు, శుద్దికి – తీరికకు యే కొదువయె యుండదు

|| మనో ||

జంతువు, పశువు, పురుగు, పక్షి – జబ్బు ఏమియు చేయవు నీకు
= సంతోషముతో నా సందేశము – చాటగ అదియు – చాటుచు నుండును

|| మనో ||

నీ బలహీనత తట్టు చూడకు – నా బలము తట్టిదిగో చూడుము
= నీ బలమునకు మించిన పనులు – నా బలమే గదా – చేయవలసెను

|| మనో ||

పాపివని నీకెవడు చెప్పెను – పావనుడవై యుండగను
= శాప మరణము రాదు నీకు – చావును చంపిన జేవము నేనే

|| మనో ||

నా రూప లావణ్యములు – నీ రూప లావణ్యము లగును
= నా రక్తము ప్రతి నిమిషము నీలో – ధారగ ప్రవహించును అది జీవము

|| మనో ||

శత్రువులు
నేను నీ కొరకు నీ యొద్ద – లేనప్పుడున్నాను
= నేను కలుగ జేసిన సృష్టిలో – నుండుట నా కిష్టము కాదా!

|| మనో ||

నా దూతలు పరలోకపు శుద్ధులు – నరలోకము నందలి విశ్వాసులు
= నా దరిని నిలిచి నీ కొరకు – నను ప్రార్ధింతురు ఏమి భయము

|| మనో ||

శత్రువుల పత్రికాదులు నా – సన్నిధి లోనికి వచ్చినవి
= స్తోత్రము చేయుము అపుడవి ధూళి – ధూళి క్రింద నెగుర గొట్టి వేతును

|| మనో ||

నీ హత్య వార్తకు జడియకుము – నిన్నది యేమి చేయగలదు ?
= నా హస్తము తోడైయుండగ – దేహము ఆత్మ స్థిరముగ నుండును

|| మనో ||

శత్రు పటాలము కన్న నీ – సైనికులే యెక్కువ మంది
= నేత్రాల్ తెరువ బడిన ఎలీషా – నిజ సేవకునివలె చూతువు

|| మనో ||

ఇదివరలో యెవ్వరును నాపై – యెదురు ప్రశ్నలు వేయను లేదు
= ఇదివరలో నిర్భయముగ చనువుగ – నెవరును సలహా లీయను లేదు

|| మనో ||

నిన్నెవరైనను ఏమియు అన్నను – నేను ఊరుకొందునా
= నన్నన్నట్టె భావించుకొని – నరులకు తీర్పు విధింపనా

|| మనో ||

యెవరేమియు నిన్నన్నను నీవు – ఏమియు అనకు, బెదరకు , వినకు
= అవి విని ప్రార్థించుము క్షమించుము – అశీర్వాద మిమ్ము మనసున

|| మనో ||

పగవారి యత్నములు చూచి – పకపక నవ్వు చుండుము
= తెగ నరుకునది నీలో యున్నది – లెమ్ము వాడుము శూరుని వలెనె

|| మనో ||

పగవారు హాని చేయుటకై – పట్టుకొందురు అయినను నీవు
= ఎగిరి పోవుదువు గనుక వారు – యేమియు చేయ లేరు నిన్ను

|| మనో ||

Leave a Comment