Manasuna Vedana Song Lyrics Telugu
మనస్సున వేదన – ఉప్పెనై రేగెనా
మనస్సులో నెమ్మది – చిద్రమై పోయె నా
శోకమే దిగమింగినా – హృదయపు ఆవేదనా
బాధల మాటున – యాత్ర కీర్తన
గాయమును మాన్పు మా – గాయపడిన యేసయ్యా
ఆదరించగా రావా – ఆదరణకర్త దేవా
ప్రియ అదరణకర్త దేవా
“మనస్సున”
1. విస్తారమైన భారముచే – మనసంతా కృంగెనెగా
బ్రతుకుదుము అన్న నిరీక్షణ – కోల్పోయి ఉండగా
మృతులను లేపు – దేవునియందే మాదు నిరీక్షణ
విమోచకుండు సజీవుడు – లేవనెత్తి మమ్ము బలపరచున్
నా విమోచకుండు సజీవుడు – లేవనెత్తి మమ్ము బలపరచున్
లేవనెత్తి మమ్ము బలపరచున్
“మనస్సున”
2. అసూయతో నన్ను ద్వేషించి – చేయని నేరమునే మోపి
అన్ని విధాల అంతము చేయ – నరమాత్రులెందరో యత్నించగా
యుద్ధము నాది ఊరకుండుడి – అనుమతించినది నేనే యని
యుద్దశూరుడా యేసయ్యా – శౌర్యముతో నన్ను నింపుమయ్యా(2)
నీ శౌర్యముతో నన్ను నింపుమయ్యా
“మనస్సున”
3. కడదాకా నీతోనే యని – వెన్నంటే నీతో ఉంటానని
ఎంతగానో నన్ను నమ్మించి – వెన్ను పోటునే పొడిచారే
మారే మనిషిని నమ్ముటకంటే – యెహోవానాశ్రయించుట మేలు
మార్పు చెందని యేసయ్యా – మాన్పుమయ్య ఈ గాయమును(2)
మాన్పుమయ్య ఈ గాయమును
“మనస్సున”
4. నిన్నే ప్రేమిస్తున్నానని – మనసంతా నీవే యని
చివరికి ఒంటరిగా జేసి – తీరని గాయమునే రేపిన
నన్ను నన్నుగా ప్రేమిస్తూ – శాశ్వత ప్రేమతో స్నేహించే
ప్రేమ స్వరూపి యేసయ్యా – మాన్పుమయ్య ఈ గాయమును(2)
మాన్పుమయ్య ఈ గాయమును