Lemmu Tejarillumu Neeku Lyrics Telugu
పల్లవి: లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చి యున్నది
అను పల్లవి: యెహోవా మహిమ నీపై – ప్రకాశముగా నుదయించె
1. జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ – కాంతికి వచ్చెదరు
2. సముద్ర వ్యాపారము – నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము – నీ యొద్దకు వచ్చును
3. దేవదారు సరళగొంజి – చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద – స్థలము మహిమ పరచెదను
4. నిన్ను శాశ్వతమైన – శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష – కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన – వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు – బలమైనట్టి జనమగును
Lemmu Tejarillumu Neeku Lyrics English
Lemmu tejarillumu neeku – velugu vacchi yunnadi
Anu pallavi: Yehovaa mahima neepai – prakaasamuga nudayinche
Janamulu needu velugunaku – paruggetti vacchedaru
Raajulu needu udaya – kaantiki vacchedaru
Samudra vyaapaaramu – nee vaipu thrippabadunu
Janamula aiswaryamu – nee yoddaku vacchunu
Devadaaru sarala gonji – chetlu naa aalayamunaku
Thebadunu naadu paada – sthala mahima parachedanu
Ninnu shaashwatamaina – shobhaatishayamuga jethun
Bahutaramulaku santosha – kaaranamuga jesedanu
Vaarilo ontariyaina – vaadu padi vandalagunu
Ennika lenivaadu – balamainatti janamagunu