కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా || Karuna Sampannuda Song Lyrics

WhatsApp Group Join Now

Karuna Sampannuda Song Lyrics Telugu

కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం
“కరుణాసంపన్నుడా”

1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
“కరుణాసంపన్నుడా”

2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
“కరుణాసంపన్నుడా”

3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
“కరుణాసంపన్నుడా”

 

Karuna Sampannuda Song Lyrics English

Karunaasampannudaa dheerudaa sukumaarudaa nee prabhaava mahimalane nirantarama neenu prakatinc hedha 
Naa paina prema choopinchi naa koraku thyaagamaithivee
Naa Yesayyaa saathvikudaa
Nee kosame naa jeevitham 
“Karunaasampannudaa”

1.
Eenadhu nanu veedani nee prema sandheshamu naa hrudaya seemalone sandadini chesen u
Anu vanuvunu balaparach e nee jeevipu vaakyam e pratikshanamu dari cheer i nannen thaaken u 
Aa vaakyam e aarogyamai jeevinpa jaesae nannen nadipinchen u
“Karunaasampannudaa”

2.
Ee vinta lokamlo nee chentha chaerithini enalaeni premathone aadharana pondhithini
Nee krupalo nilipina dhi nee prema bandhame anudhinamu makarandam e nee snehabandhamu 
Aa premalone kada varaku nannu nadipinchu maa sthiraparachu maa
“Karunaasampannudaa”

3.
Nae vechiyunnanu nee mahima prathyakshathakai naakunna ee nireekshanae sannidhilo nilipina dhi
Naa kosam nirmainc h e saundharya nagar mulo pranamilli chesedhanu nee paadhaabhivandanam a
Thejoma yaa nee shobhitam u nae pondhedha koniyaadhedha
“Karunaasampannudaa”

Leave a Comment