Ennatarambe Yidi Pendli Lyrics Telugu
ఎన్నతరంబే యిది – పెండ్లి యేర్పాటు – ఎంతో యద్భుతమైనది
మన్ను తీసి పురుషుని నిర్మాణము చేయుటె వింత, పన్నుగా నాతని యెముకతో
భార్యను చేయుట యంత కన్న వింత, వీరివలన – గ్రమముగ నిందరిని
త్పన్నము గావించు దేవుని – పనిని నేమని పలుక గలము
|| ఎన్న ||
1. పురుష పాదము నుండి – స్త్రీ వెడల నెప్పుడు ద్రొక్కబడుచు నుండు
శిరసునుండి సృజింప బడిన – స్త్రీ యధికురాలౌను గనుక
నర శరీరము నెడమ బ్రక్కను – నారి కలిగెను: గాన భర్తకు
సరిసమాన సతిగ హృదయము సరసున కుదిరి ప్రీతి – కర ముగ నొప్పుచును
త్కరము క్రిందనే పోషిత యగును
|| ఎన్న ||
2. ఒకటి కన్నను రెండు – మేలుభయు – లొనగూడు బలమై యుండు
సకల దేహాత్మల విషయములందేకమై – యొకరి కొకరు తోడై
యొకటె యారాధన – యొకటి విశ్వాసము నిరీక్షణ – నొంది
స్త్రీ పురుషులు ధరణిని = వికసితులుగ వసింప బెండ్లిని
విభుడు నియమించెను గృపామతి
|| ఎన్న ||
3. పాపంబు భువి జొచ్చెను – తత్పరిహార వరుడౌ యేసు వచ్చెను
పాపి యాత్మకు మోక్ష సంబంధమగు హర్షంబు రక్షణ
యీ పవిత్ర విమోచకు – డీ యిలను గల సంతోషములలో
వ్యాప నంబున శుభమగు వివాహ మందె రక్షణ కర
మౌ పనికి నారం భమైన – యద్భుతము తొలిసారి జేసె
|| ఎన్న ||
4. పతనమప్పుడు పల్కిన – శాపమందున బహుగా నున్నది దీవెన
సతి ప్రసవ కష్టమును దీర్పను – సంతతి నొసంగు దేవుడు
పతి పొలమునంబడు శ్రమమునకు – ఫలము భూమి పంటగలద; జన
వితతి బ్రోవను వనిత వంశజ – వీరునిగను బురుష రూపిగ
హిత విమోచకు నంపె స్రష్ట – యిదియె స్త్రీ పురుషులకు గొప్ప
|| ఎన్న ||
Ennatarambe Yidi Pendli Lyrics English
Ennatarambe Yidi – Pendli Yerpaata – Ematho Yadbhutamainadhi
Mannu Theesi Purushuni Nirmanamu Cheyuthe Vinta, Pannuga Naathani Yemukatho
Bhaaryanu Cheyutaha Yentha Kanna Vinta, Veerivalana – Gramamuga Nindarin i
Tpannamu Gaavincchu Devuni – Panini Neman i Paluka Galamu
|| Enna ||
Purusha Paadamu Nundi – Stri Vedala Neppudu Drokkabaduchu Nundu
Shir asunundi Srujinpa Badina – Stri Yadhi kuralaunau Ganuka
Nara Shareeramune Dama Brakkana – Naari Kaligenu: Gaana Bharthaku
Sarisa maana Sathiga Hrudhayamu Sarasuna Kudhiri Preethi – Kara Muga Noppuchunu
Tkaramu Krindhane Poshitha Yagunu
|| Enna ||
Okati Kanna Rendhu – Meelu Bhayulu – Lonagoodeu Balamai Yundu
Sakala Dehaathmala Vishayamulandeka mai – Yokari Kokaru Thodhai
Yokate Yaaraadhana – Yokati Vishwasamu Nireekshana – Nondi
Stri Purushula Dhara nini = Vikasithuluga Vasimpa Bendlin i
Vibhudu Niyaminchenu Grupamathi
|| Enna ||
Paapambu Bhuvi Jochchenu – Thatparihara Varudaau Yesu Vachchenu
Paapi Yaathmaka Moksha Sambandhamagu Harshambu Rakshana
Ee Pavithra Vimochaku – Dee Yilanu Gala Sathoshamulalo
Vyaapa Nambuna Shubhamagu Vivaaha Mande Rakshana Kara
Maupani Kaaraam Bhamaaina – Yadbhutamu Tholisari Jesse
|| Enna ||
Patanamappudu Palkina – Shaapamanduna Bahuga Nunnadhi Deevena
Sathi Prasava Kashtamunu Deep rana – Santhathi Nosangu Devudu
Pathi Polamunambadhu Shramamunaku – Phalamu Bhoomi Pantagaladha; Jana
Vithathi Broovana Vanitha Vamshaja – Veerunigana Burusha Roopiga
Hitha Vimochaku Nampe Srashta – Yidhiye Stri Purushulaku Goppa
|| Enna ||