ధ్యానించుచుంటిమి Dhyaninchuchuntimi Siluvapai palikina Song Lyrics

WhatsApp Group Join Now

Dhyaninchuchuntimi Siluvapai palikina Telugu Lyrics

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు (2)
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్ఠుడా…

||ధ్యానించుచుంటిమి||

1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్థన చేశావా బాధించేవారికై (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)

||ధ్యానించుచుంటిమి||

2. నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)

||ధ్యానించుచుంటిమి||

3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎపుడు (2)
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబప్రాధాన్యతను (2)

||ధ్యానించుచుంటిమి||

4. దేవా నా దేవా
నన్ను విడనాడితివి వెందుకు
చెవినీయవే నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్ష ననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)

||ధ్యానించుచుంటిమి||

5. సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)

||ధ్యానించుచుంటిమి||

6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా కల్వరి గిరినుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2)

||ధ్యానించుచుంటిమి||

7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగా విజయము చాటి (2)

||ధ్యానించుచుంటిమి||

Dhyaninchuchuntimi Siluvapai palikina English Lyrics

Dhyaninchuchuntimi Siluvapai palikina
Viluvaina nee maatalu (2)
Praanatmalanu sedadeerchu Jeeva ootalu (2)
Mokshamunaku cherchu baatalu
Parishudhatala paripoornudha
Unnatha guna sampannudha (2)
Shresthudha…

||Dhyaninchuchuntimi||

1. Tandri veeremi cheyuchunnaro erugaru

Veerini dayatho Kshaminchumu (2)
Ani praarthana chesaava baadhinchevaariki (2)
Shatruvulanu preminchuta nerputhakai (2)

||Dhyaninchuchuntimi||

2. Nedha nathonu paradiesulō neevunduvu
Nishchayamuga pravesinthuvu (2)
Ani maata ichhaava dongavaipe choochi (2)
Adhikaratō paapini rakshinchi (2)

||Dhyaninchuchuntimi||

3. Idhigo nee talli ithadha nee kumaarudu
Kashtamu raaneeyaku epudu (2)
Ani shishyunikichaava amma baadhyanthanu (2)
Teliyaje kay kaṭumbapradhaanityanu (2)

||Dhyaninchuchuntimi||

4. Deva naa Deva
Nannu vidanaadivē venduku
Cheviniiva ne naa praarthanaku (2)
Ani keka veshaava shiksha nanubhavisthu (2)
Paraloka maargam siddhamu cheesthu (2)

||Dhyaninchuchuntimi||

5. Sarva sristhikarta nu ne dappigonuchuntini
Vaakyamu neravērchuchuntini (2)
Ani satyamu telipaava kannulu terachutaku (2)
Jeeva jalamanu anugraha jeevajalamu anugraha injesthu (2)

||Dhyaninchuchuntimi||

6.Samaaptamayyindhi Loka vimōchana kaaryam
Neravērenu Ghaana sankalpam (2)
Ani prakatanam chesaava Kalvari girinunchi (2)
Pani muginchini nee tandrimu ghanaparachi (2)

||Dhyaninchuchuntimi||

7. Naa aathmanu nee chethiki appaginchuchuntini
Nee yoddaku vachuchuntini (2)
Ani vinnavinchhaava viddheyatha thoti (2)
Thala vanchi trupthigaa vijayamu chaati (2)

||Dhyaninchuchuntimi||

 

Core spiritual theme

The main theme is “Jesus’ words from the cross as living, transforming truth.” Each verse reflects one of the seven sayings, and the song turns them into a meditation that helps believers:

  • See the cross as the place of mercy and forgiveness (for enemies and sinners).

  • Understand the cross as the door to eternal life and paradise for all who come to Him.

  • Learn love for family and care for others (through the way Jesus entrusted His mother).

  • Experience God’s victory over sin and death.

Leave a Comment