Devudichina Divyavakya Song Lyrics Telugu
దేవుడిచ్చిన దివ్యవాక్య మిదేను మన కో యన్నలారా
భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు
||దేవుండిచ్చిన||
1. భయముతో భక్తితోంజదివిన ప్రభు క్రీస్తుండటంచుండు
దెల్పును దయామయుండగు దేవుండే మన తండ్రి యంటి
బోధించు నెల్లెడ
||దేవుండిచ్చిన||
2. సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును
బోధమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ
నుండును
||దేవుండిచ్చిన||
3. ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీరనుసరించుండు
దోషములు నెడబాసి మోక్షపు ద్రోవంగోరిన వారలెల్లరు
||దేవుండిచ్చిన||
4. పాపములలో నుండి విడుదలంపరమ సుఖమని దలంతు
రేయుంటాప మార్పును లేచి రండి త్వరగా క్రీస్తుని
శరణు బొందను
||దేవుండిచ్చిన||
5. దురిత ఋణములు దీర్చు మధ్యస్థుండు గావలె నన్న
వారలు త్వరగ రండి త్వరగ రండి వరదుడౌ క్రీస్తు కడ
కిపుడె
||దేవుండిచ్చిన||
6. మరణమునకై భయము నొందెడి మానసము గల వారలెల్లరు
పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జడాయంగ రండి వేగము
||దేవుండిచ్చిన||
7. నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు
ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము
||దేవుండిచ్చిన||
8. మోక్ష రాజ్యముంజేరంగోరెడు బుద్ధి గలిగిన వారలెల్లరు రక్ష
కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు
Devudichina divyavakya midhenu manako yannalara
Bhaava shuddhini jeyu ghana shubha varthamanamu dheenipaeru
||Devudichina||
1. Bhayamutho bhakthithon jadivina praapu Khristhun datanchun
Delpunu dhaya mayundagu devundae mana thandri yani
Bodhichu nalleda
||Devudichina||
2. Sathya shaantamulu lankurinchunu sathkriya phalamulunu
Bodhamunu nithya jeevamu galugu dhananni nissandhehamuga
Nundunu
||Devudichina||
3. Ee sumangala divyavakyamu nippude mee ranusarichundu
Dhosamula nedabaasi mokshapu druvam gorina vaarellaru
||Devudichina||
4. Paapamulalo nundi vidudala parama sukha manidalantu
Raneyunu thaapa maarpunu lechi randi tharaga Khristhuni
Sharanu bondanu
||Devudichina||
5. Duritha runamula dheerchu madhya sthundu gaavale nanna
Vaaru tharaga randi tharaga randi varadudau Khristhu kada
Kipude
||Devudichina||
6.
Maranamunakai bhayamu nondhedhi maanasa galavara lellaru
Parama shaanti yosangu Khristhuni pajja dayanga randi vegamu
||Devudichina||
7.
Nirmalaanthahkarana saukhyamu nijamuga nilavedakuvru
Dharma chithundaina Khristhuni dariki randi randi vegamu
||Devudichina||
8.
Moksha raajyamu jeranga goredhu buddhigaligina vaara lellaru raksha
Kundagu Yesu noddaku randi randi vishwasinchu
||Devudichina||