Deva Yehova Stuti Song Lyrics Telugu
దేవ యెహోవా! స్తుతి పాత్రుండ!
పరిశుద్ధాలయ పరమ నివాసా!
|| దేవ ||
1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత – సర్వము నీవే
సకల ప్రాణులు స్తుతి చెల్లించగ – సర్వద నిను స్తుతు-లొనరించగనున్న
|| దేవ ||
2. నీదు పరాక్రమ కార్యములన్నియు – నిరతము నీవే
నీదు ప్రభావ మహాత్మ్యములన్నియు – నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే
|| దేవ ||
3. స్వర మండల సితారలతోను – బూరల ధ్వనితో
తంబురలతో నాట్యము లాడుచు – నిను స్తుతియించుచు – స్తోత్రము జేసెదము
|| దేవ ||
4. తంతి వాద్య పిల్లన గ్రోవి – మ్రోగెడు తాళము గంభీర
ధ్వని గల తాళములతో – ఘనుడగు దేవుని కీర్తించను రారే
|| దేవ ||
5. పరమాకాశపు దూతల సేనలు – పొగడగ మీరు
ప్రేమమయుని స్తోత్రము చేయగ – పరమానందుని – వేగస్మరించను రారే
|| దేవ ||
6. సూర్య చంద్ర నక్షత్రంబు – గోళములారా!
పర్వతమున్నగు వృక్షములారా! – పశువులారా! – ప్రణుతించను రారే
|| దేవ ||
7. అగ్నియు మంచును సముద్ర ద్వీప – కల్పము లారా
హిమమా వాయువు తుఫానులారా! – మేఘములారా! మహిమ పరచ రారే
|| దేవ ||
8. సకల జల చర సర్వ – సమూహములారా!
ఓ ప్రజలారా! భూపతులారా! – మహనీయుండగు – దేవుని స్తుతి చేయన్
|| దేవ ||
Deva Yehova Stuti Song Lyrics English
Deva Yehova! Stuti Paatrunda!
Parishudhaalaya Parama Nivaasa!
|| Deva ||
1. Balamunu Keertiyu Shakti Prasiddhata – Sarvamu Neeve
Sakala Praanulu Stuti Chellinchaga – Sarvada Ninu StutuloNarichaganunna
|| Deva ||
2. Needu Paraakrama Kaaryamulanniyu – Niratamu Neeve
Needu Prabhaava Mahaatmyamulanniyu – Nityamu Pogadaga Niratamu Stotramule
|| Deva ||
3. Swara Mandala Sitaaralatotonu – Boorala Dhvanito
Tamburalatonu Naatyamulaaduchu – Ninu Stutiyinchuchu – Stotramu JeseDamu
|| Deva ||
4. Tanti Vaadya Pillana Groovi – Mrogedu TaaLamu Gambiira
Dhvani Gala TaaLamulato – Ghanudagu Devuni Kiirtinchhanu Raare
|| Deva ||
5. Paramaakaasapu Dootala Senalu – Pogadaga Miiru
PremaMayuni Stotramu Cheyaga – Paramaananduni – VegalasmariNchanu Raare
|| Deva ||
6. Soorya Chandra Nakshatrambu – Golamulaaraa!
Parvatamunnagu Vrukshamulaaraa! – Pashuvulaaraa! – Pranutinchhanu Raare
|| Deva ||
7. Agniyu Manchunu Samudra Dweepa – Kalpamu Laaraa
Himamaa Vaayuvu Tufaanulaaraa! – Meghamulaaraa! Mahima Paracha Raare
|| Deva ||
8. Sakala Jala Chara Sarva – Samoohamulaaraa!
O PrajaLaaraa! Bhoopatulaaraa! – MahaNiIyundagu – Devuni Stuti Cheyan
|| Deva ||