దేవ స్తోత్రగానముల్ పై Deva Sthothra Gaanamulpai Lyrics

WhatsApp Group Join Now

Deva Sthothra Gaanamulpai Lyrics Telugu

దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో
దేవమారు గానముల్ భూ దేశ స్థలములో
దేవలోక పావనులును దీన నరులును బోవజూడ
భువి దివి క్రిస్మస్ దేవ

1. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో
పవ్వళించి యున్న దేవ బాల యేసులో
ఇవ్విధముగ సఫలమాయే ఈదినంబున నవ్వుమోము
నరుని కబ్బెను దేవ

2. షేము దేవ వందనంబు చెప్పబడియెను భూమి
స్తుతుల నందు కొనెడి పూజనీయుడు
భూమిపైన నరుడుగాను బుట్టవచ్చెను
భూమి క్రిస్మస్ భోగమొందెను దేవ

3. అందరి వంశంబులు నీ యందు దీవెన
బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు
అందె క్రీస్తు యూదులకును అన్యజనులకున్
విందు క్రిస్మస్ విశ్వమంతటన్ దేవ

4. షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు
నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు
నేలమీద నిత్యశాంతి పాలనజేయ
పాలకుండౌ బాలుడు జన్మించెన్ దేవ

5. అక్షయమగు చుక్క యొకటి యాకోబులో
లక్షణముగ బుట్ట వలయు ను ధాత్రి పై
రక్షణార్ధులే సదా నిరీక్షించెడు నక్షత్రంబగు
రక్షకుడుదయించె దేవ

6. పుట్టవలయు మోషేవంటి పూర్ణ ప్రవక్త
ఎట్టివారలైన నెరుగనట్టి ధర్మముల్
దిట్టముగను స్థాపింప దేవ పుత్రుడు
పుట్టెన్ గొప్ప బోధకుడాయెను దేవ

7. మరియ పుత్ర నామం ఇమ్మానుయేలగున్
నరులకు దేవుండె తోడు నిరతము వరకున్
దరిని దేవుడుండు గాన వెరవమెన్నడున్
పరమ దేవుని సహవాసము లభించున్ దేవ

8. మన నిమిత్తమైన శిశువు మహిని బుట్టెను
చనువుగ దరిజేర శిశువు స్వామియాయెను
తనువు రక్షణను గణింప వెనుకదీయదు
వినయ భూషణులకు వేళవచ్చెను దేవ

9. మొలకలెత్తవలె యెష్షయి మొద్దునందున
ఫలము లేని మోడు నరుల వంశ వృక్షము
విలువగలుగు నిత్యజీవ ఫలములిడుటకై
కళగల జన్మార్ధ కరుడు వచ్చెను దేవ

10. ఖలులు చీకటిన్ నడుచుచు వెలుగుచూచిరి
పలు విధంబులైన యట్టి పాప చీకటుల్
తొలగ జేసి శుద్ధకాంతి కలుగ జేయను
వెలుగుగా దేవుడు వెలసె ధాత్రిలో దేవ

11. అల్పమైన బెత్లెహేము నందున క్రీస్తు
నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను
అల్పులందు సైతమల్ప మైన యూళ్ళలో
స్వల్ప రక్ష స్థాపకుడై వచ్చె దేవ

12. ఆడి తప్పనట్టి దేవ అనంత స్తోత్రముల్
నాడు పల్కు వాగ్ధానముల నన్నిటిన్
నేడు నెరవేర్చినావు నీ సుతునంపి
కీడుల్ బాపు క్రిస్మసుగల్గె దేవ

13. నీ నిజ వాగ్ధత్తములను నిత్యము నమ్మి
వాని నెరవేర్పులు విని వట్టివి యనక
మానసమున ననుభవించు మనసు నీయుమ
నీ దానామూల్య జ్ఞాన మొసగుమీ దేవ

14. గగనమందు క్రిస్మసుండు గాన కీర్తులౌ
జగతియందు క్రిస్మసుండు స్థవము గల్గుత
యుగ యుగముల వరకు త్రైకుడొందు ప్రణుతులు
సొగసుగ బరిగెడు చోద్య గీతముల్ దేవ

Deva Sthothra Gaanamulpai Lyrics English

Deva sthothra gaanamul pai – divya sthalamulo
Devamaaru gaanamul bhoo – desha sthalamuloo =
Devaloka paavanulunu – dheena narulunu bova jooda
Bhuvi divi Christmas (Looka 2:9-14) || Deva ||

 1
Avvakaichchina tatti vaakku – adhigo thottilo
Pavvalinchi yunna deva baala Yesulo =
Ivviddhamuga sapalamaye – eedinambuna navvumomu
Naruni kabbenu (Aadhi 3:15) || Deva ||
 2
Shemu deva vandhanambu – cheppabadhiyenu bhoomi sthuthula
Nandhu konedi – poojaneeyudu =
Bhoomipaina naruduga – bhuttavachchenu bhoomi Christmas
Bhogamondhenu (Aadhi 9:26) || Deva ||
 3
Andhari vamsambulu nee – yandhu dheevena
Bondunanchu nabraamunaku nandhenuvaakku =
Andhe Kreestu Yoodulakunu anya janulakun
Vindu Christmas – vishvamantatam (Aadhi 12:3) || Deva ||
4
Sheelova chachchuvaraku yoo – daalo niluchchu
Nelaraaju danda mundhu neppudu tholagadhu =
Nelameedha nithya shaanti paalanajeya
Paalakundau – baaludu janminchenu (Aadhi 49:10) || Deva ||
5
Akshayamagu chukka yokati – Yaakobulo
LakshaNamuga bhutta valayu – nudaathri pai =
RakshaNaardhule sadaa ni – reekshinedu nakshatrambagu
Rakshakudayainchenu (Samkhya 24:17) || Deva ||
6
Puttavalayu Moshevanti – poorNa pravaktha
Ettivaaralaina neruga – natti dharmamul
Dittamuganu sthaapinpa – deva putrudu
Puttemu goppa – bodhakudhayenu (Dviteea 18:18) || Deva ||
7
Mariya puthra naama – mimmaanu耶elagun
Narulaku devundetho杜du – nirathamu varakun
Dharini devudungaana – veravamendun
Param devuni saha – vaasamu labhinchunu (Yesha 7:14) || Deva ||
8
Mana nimitthamina shishuvu – mahini bhuttenu
Chanuvuga dharijerra shishuvu – swaameeyayenu =
Thanuvu rakshaNanugaNinpa – venukadheeyadhu vinaya bhooshaNulaku
Vela vachchenu (Yesha 9:6) || Deva ||
9
 Molakale ththavale Yeshayi – moddhunandhuna
Phalamu leeni moodha narula – vamsa vrukshamu =
Viluvagalugu nithya jeeva – phalamulidutakaika lagala
Janmaardha – karudhu vachchenu (Yesha 11:1) || Deva ||
10

Khalulu cheekatindha nadhuchchu – veluguchoochirri
Palu vidhambulaina yatti – paapa cheekatulu =
Tholaga jeshi shuddha kaanti – kaluga jeyanu
Veluguga devudu – velase dhaathrilo (Yesha 9:2) || Deva ||

11

Alpamina Betllehemu – nandhuna Kreestu
Nilpavalenu thanadhu janma – nija charithranu =
Alpulandhu saithamalp – maina yoollaloo
Swalpa raksha – sthaapakudhai vachche (Meeka 5:2) || Deva ||

12
Aadhi thappanatti deva – anantha sthothramul
Naadu palku vaaghdha – namula nanneethin =
Nedu neraverchinaavu – nee sutunampi
Keeyulu baapu – Christmasugalge (2 Korinthi 1:20) || Deva ||
13
 Nee nija vaagdhaththamulanu – nithyamu namme
Vaani neraverpulunu vini – vattivi yanaka =
Maanasamuna nanubhavinchu – manasu
Nee yumu nee – daanaamoolya – jnana mosagumee (Looka 2:29-32) || Deva ||
14
Gaganamandhu Christmasundhu – gaana keerthulau
Jagathiyandhu Christmasundhu sthavamu galgutha =
Yuga yugamula varaku thraiku – dondhu praNuthulu sogasuga barigedu
Chodya geethamul (Looka 2:14) || Deva ||

Leave a Comment