Daivaatmaa Rammu Song Lyrics Telugu
దైవాత్మా రమ్ము – నా తనువున వ్రాలుము – నా
జీవమంతయు నీతో నిండ – జేరి వసింపుము
|| దైవాత్మా ||
1. స్వంత బుద్ధితోను – యేసు ప్రభుని నెరుగలేను – నే
నెంతగ నాలోచించిన విభుని – నెఱిగి చూడలేను
|| దైవాత్మా ||
2. స్వంత శక్తితోను – యేసు స్వామి జేరలేను – నే
నెంత నడచిన ప్రభుని కలిసికొని – చెంత జేరలేను
|| దైవాత్మా ||
3. పాప స్థలము నుండి – నీ సువార్త కడకు నన్ను
పరమాత్మ నడుపుచుండుము – ఉత్తమ స్థలమునకు
|| దైవాత్మా ||
4. పాపములో మరల – నన్ను పడకుండగ జేసి
నీ పరిశుద్ధమైన రెక్కల – నీడను కాపాడు
|| దైవాత్మా ||
5. పరిశుద్ధుని జేసి – నీ వరములు దయచేసి
నీ పరిశుద్ధ సన్నిధిని జూపుమ – పావురమా వినుమా
|| దైవాత్మా ||
6. తెలివిని గలిగించు – నన్ను దివ్యెగ వెలిగించు – నీ
కలిగిన భాగ్యములన్నిటిని – నా కంటికి జూపించు
|| దైవాత్మా ||
7. నన్నును భక్తులను – యే నాడును కృపతోను – నిల
మన్నించుము మా పాప రాసులను – మాపివేయు దేవా
|| దైవాత్మా ||
8. వందనములు నీకు – శుభ వందనములు నీకు
ఆనందముతో కూడిన – నా హృదయ వందనములు నీకు
|| దైవాత్మా ||
Daivaatmaa Rammu Song Lyrics English
Daivaatmaa Rammu – Naa Tanuvuna Vraalumu – Naa
Jiivamantayu Niito Ninda – Jeri Vasinpumu
|| Daivaatmaa ||
1. Svanta Buddhiito nu – Yesu Prabhu ni Nerugale nu – Ne
Nentaga Naalo chichina Vibhuni – Nerigi Choodale nu
|| Daivaatmaa ||
2. Svanta Shaktiito nu – Yesu Svaami Jerale nu – Ne
Nenta Nadachina Prabhu ni Kalisikoni – Chenta Jerale nu
|| Daivaatmaa ||
3. Paapa Sthalamu Nundi – Nee Suvaarta Kadaku Nannu
Paramatma Nadupu Chundumu – Uttama Sthalamunaku
|| Daivaatmaa ||
4. Paapamulo Marala – Nannu Padakundaga Jaesi
Nee Parishuddhamaaina Rekkala – Needanu Kaapaadu
|| Daivaatmaa ||
5. Parishuddhuni Jaesi – Nee Varamulu Dayachesi
Nee Parishuddha Sannidhini Joopuma – Paavuramaa Vinuma
|| Daivaatmaa ||
6. Telivini Galigincu – Nannu Divvega Veligincu – Nee
Kaligina Bhaagyamulan niti ni – Naa Kantiki Joopincu
|| Daivaatmaa ||
7. Nannunu Bhaktulanu – Ye Naadunu Krupato nu – Nila
Mannincumu Maa Paapa Raasulanu – Maapiveyu Devaa
|| Daivaatmaa ||
8. Vandanamulu Niiku – Subha Vandanamulu Niiku
Aanandamuto Koodina – Naa Hrudaya Vandanamulu Niiku
|| Daivaatmaa ||