చూడ గోరెద దేవ || Chuda Goreda Deva Lyrics

WhatsApp Group Join Now

Chuda Goreda Deva Lyrics Telugu

చూడ గోరెద – దేవ – మంది రావరణములను – చూడ గోరెద =
చూడ నాకు నాశ గలదు – సుంద రావరణము లవి = చూడ నాదు
ప్రాణమెంతో – సొమ్మసిల్లుచున్నదహా

||చూడ||

1. నీదు నివాసములు జూడ – నెంతో రమ్యమై తన ర = నాదు
హృదయమునకు నా – నంద మిచ్చు నిపుడు నెపుడు

||జూడ||

2‌. జీవము గల ప్రభుని జూడ – జీవి నాలో కేక వేసె = కోవెలలకు
దొరికె గూటి – తావు నీ మందిరమున

||చూడ||

3.పిచ్చుకలకు దొరికె స్థలము – ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు
కుతూహలముతోను – పిల్లల నవి మందిరమున
||చూడ||
4.నీదు మందిరంబులోన – నిత్యవాసులైనవారు = నిక్కముగను
ధన్యులగుచు – నిన్ను సన్నుతింతు రహా

||చూడ||

5.ప్రభుని వలన బలము నొందు – ప్రజలు ధన్యులగుదు రిల = ప్రాణ
ప్రియము యాత్ర సేయు – ప్రజల మార్గ మమర ధరను

||చూడ||

6.నీదు యావరణములలో – నేను నొక్క దినము గడుప = నెంతో
విలువ గలుగు నాకు – వేయినాళ్ల బ్రతుకు కన్న

||చూడ||

7.కానరండు మనము నిపుడె – మనము లలర ప్రభుని జూడ =
మందిరమున కేగి నిండు – మనశ్శాంతి బొంది బ్రతుక

||చూడ||

Chuda Goreda Deva Lyrics English

Chooda goreda – Deva mandira avaranamulanu – chooda goreda =
Chooda naaku naasha galadu – sundara avaranamulavi – chooda naadu
Pranamentho – sommasilluchunnadaha

||Chooda||

Needu nivaasamulu juda – ento ramyamai tanara – naadu
Hrudayamunaku naa – nandamichchu nipudu nepudu

||Chooda||

Jeevamu gala prabhuni juda – jeevi nalo keka vese =
Kovelalak(u) dorike gooti – taavu nee mandiramuna

||Chooda||

Picchukalaku dorike sthalamu – muchchata balipeetha meduta =
Pettu kuthuuhalamutonu – pillala navi mandiramuna

||Chooda||

Needu mandirambulona – nityavaasulainavaru =
Nikkamuganu dhanyulagu chu – ninnu sannuthinthu raha

||Chooda||

Prabhuni valana balamu nondu – prajalu dhanyulagu durila =
Praana priyamu yaatra seyu – prajala maarga mama radharanu

||Chooda||

Needu aavaranamulalo – nenu nokka dinam(u) gadupa =
Nento viluva galugu naaku – veyi naalla bratuku kanna

||Chooda||

Kaanarandu manamu nipude – manamu lalara prabhuni juda =
Mandiramuna keg(i) nindu – manasshaanti bondi bratuku

||Chooda||

Leave a Comment