చేసి కొనరాదు అపార్ధము చేసికొన రాదు || Chesi Konaradu Apaarthamu Lyrics

WhatsApp Group Join Now

Chesi Konaradu Apaarthamu Lyrics Telugu

చేసి కొనరాదు – అపార్ధము చేసికొన రాదు
దేవుని నపార్ధము చేసికొన రాదు
పరిశుద్ధుని నపార్ధము చేసికొన రాదు

|| చేసికొన ||

1. పరమ దేవుడే ప్రేమం – పరమ న్యాయ సంధానం
గురుతర శక్తి విధానం – నిరుపమాన సుజ్ఞానం
= వరగుణ ధీరోధారీ స్థా – వరగుణ ధీరోధారి గాన

|| చేసికొన ||

2. సర్వ వ్యాపకత్వుండు – నిర్వికార దేవుండు
నిర్వచన సజీవుండు సర్వత్ర స్వతంత్రుండు
= సర్వ సులక్షణ ధారి – శ్రీ – సర్వ సులక్షణ ధారి గాన

|| చేసికొన ||

3. నిత్యమౌ మహాత్యంబు – అత్యధిక ప్రభావంబు
ప్రత్యక్ష పరాక్రమంబు – సత్యమైన తేజంబు
= నిత్య సులక్షణధారి – ఔ – నిత్య సులక్షణ ధారి గాన

|| చేసికొన ||

4. దైవ ప్రేమ కొనియాడ – దైవ న్యాయమును బాడ
దైవ శక్తి గొని వేడ – దైవ జ్ఞాన మొనగూడ
= జీవ సులక్షణధారి – స – జీవ సులక్షణ ధారి గాన

|| చేసికొన ||

5. కష్టము వచ్చిన గాని – నష్టము వచ్చిన గాని
ఇష్టము లేక పోనీ భ్రష్టుడవైనను గాని
= స్రష్టననుట మేలా – నీ – దృష్టి కిదియన వీలా గాన

|| చేసికొన ||

6. ప్రార్థనాలకించినను – ప్రార్థన వినకుండినను
వ్యర్ధంబై పోయినను అర్ధముగాకుండినను
= సార్ధక పరచుము గాని అ – పార్థము చేయుట హాని గాన

|| చేసికొన ||

7. ఇబ్బందులు రోగములు – సిబ్బందివలె శ్రమలు
అబ్బో భూకంపములు – మబ్బువంటి దురితములు
= తబ్బిబ్బు చేసిన కాని – హా – తప్పు తలంచుట హాని గాన

|| చేసికొన ||

8. ఆకాశంబులన్ని లోకానందము లన్ని – నీకై యిచ్చిన వన్ని
ప్రాకటముగ పోదన్ని
= నాకేమి యిడె నటంచు – నీ – కేకలు మాని తలంచు గాన

|| చేసికొన ||

Chesi Konaradu Apaarthamu Lyrics English 

Chesi konaradu – apaarthamu chesikona raadu
Devuni napaarthamu chesikona raadu
Parishuddhuni napaarthamu chesikona raadu

|| Chesikona ||

Parama devude prema – parama nyaaya sandhaanam
Gurutara shakthi vidhaanam – nirupa maana sujnaanam
= Varaguna dheerodhaari sthaa – varaguna dheerodhaari gaana

|| Chesikona ||

Sarva vyaapakathvundhu – nirvikaara devundhu
Nirvachanaja jeevundhu sarvatra svathanthrundhu
= Sarva sulakshana dhaari – shree – sarva sulakshana dhaari gaana

|| Chesikona ||

Nithyamau mahaathyaambu – athyadhika prabhaavaambu
Prathyaksha paraakramaambu – sathya maina thejaambu
= Nithya sulakshana dhaari – au – nithya sulakshana dhaari gaana

|| Chesikona ||

Daiva prema koniyaada – daiva nyaayamunu baada
Daiva shakthi goni veda – daiva jnaana monagoonda
= Jiva sulakshana dhaari – sa – jiva sulakshana dhaari gaana

|| Chesikona ||

Kashtamu vachchina gaani – nashtamu vachchina gaani
Ishtamu leka poni hrash thudavainanu gaani
= Srushtan anutame laa – nee – drushti kidiyana veelaa gaana

|| Chesikona ||

Praarthanaalakichchina nu – praarthana vina kundinanu
Vyartha mbai poyinanu ardhamugaakundinanu
= Saartha ka parachuma gaani a – paarthamu cheyutha haani gaana

|| Chesikona ||

Ibbandhulu rogamu lu – sibbandhi valae shramalu
Abbho bhookampa mulu – mabbuvanthin durithamulu
= Thabhibbu chesina kaani – haa – thappu thalanchutha haani gaana

|| Chesikona ||

Aakaasha mbula nni lokaanandamu lanni – neeka i yichchina vanni
Praakatamuga podanni
= Naakeemi yide natanchu – nee – kekalu maani thalachu gaana

|| Chesikona || 

Leave a Comment