Cheri Jeevinchudi Song Lyrics Telugu
చేరి జీవించుడి – దేవాది దేవుని
చేరి జీవించుడి = చేరి జీవనము చేసిన యెడల
కోరిన మోక్షము ఊరకే దొరుకును
|| చేరి ||
1. మంచినే చేరుడి – దానినే అనుసరించి జీవించుడి
మంచి మార్గమున ఆటంకములు – మాటిమాటికి వచ్చును గాని
కించిత్తైనను మంచిని గూర్చి – వంచన దారి యటంచు తలంపక
మంచిచెడ్డలన్ గుర్తింపగల – మనస్సాక్షిని ఇమ్మని దేవుని = యెంచి ప్రార్థన చేయుచు స్తుతితో
|| చేరి ||
2. పాపముల్ మానుడి – ఆ చెడ్డదారి – వైపె చూడకుడి
పాపము పాప ఫలితమై యున్న – శాపము సాతాన్ అతని సైన్యము
చూపున కెంతో రమ్యములైన – ఆపదలును ఆ పాప మార్గమున
దాపరించి యుండును కావున – దాపున జేరిన అది నరకంబను = కూపములోనికి నడుపును గాన
|| చేరి ||
3. చేసి చూడరాదా – దైవప్రార్థన చేసి – తరచ రాదా
యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు – యేసే మార్గము
యేసే సత్యము – యేసే జీవము యేసే దేవుడు – యేసే సర్వము
యేసే పాపికి – దోషముల పరిహారకుడు ఈ – వ్యాసము నిజమో కాదో తెలియ = జేసెడి ప్రార్థన చేయుచు దేవుని
|| చేరి ||
4. మోకరింప రాదా – మన దేవుని యెదుట – మోకరింప రాదా
మోక రించి ప్రార్థించి యడిగిన – మీకే మనస్సున దేవుడు తెల్పును
లేకపోయిన మీజ్ఞానాక్షి కే – కన్పర్చి సత్యము నేర్పును
మీ కంటికి సృష్టిని గానంబడు – మేళ్ళ మూలముగ స్ఫురింప జేయును… లోకైక రక్షకుడౌ క్రీస్తు = లో సమస్తము లభించు గాన
|| చేరి ||
5. ఆని యుండరాదా – దైవ గ్రంథంబు నాని యుండరాదా
నానాటికి పాపాలు హెచ్చయి – నరులను పాడు చేయు చున్నవి
నానావిధ రోగములు చేరి – మానవుల నవి చంపు చున్నవి
మానవులందు సోదర ప్రేమ – లేనందున కలహాలౌ చున్నవి… వీనికి విరుగుడు దైవ ప్రార్థన = గాన దేవుని సన్నిధి యందు
|| చేరి ||
6. చేయనే చేయను – తెలిసిన తప్పిదముల్ చేయనే చేయను
చేయను ఎవ్వరు చెప్పినగాని – చేయను నైజము చెప్పిన గాని
చేసెదను తండ్రి నీ చిత్తము – చొప్పున చేసెదను తండ్రి
చేసెదను నీ చిత్తము చొప్పున = చేదుగ నున్నను చేసి తీరెదను