Chakkadanamunu Minchina Song Lyrics Telugu
చక్కదనమును మించిన – చక్కదనము కలిగిన
సౌందర్య సంఘమిదియే – సర్వసృష్టిలో
||చక్క||
తనతో సమానమైన – స్వరూపంగల కన్యకగా
నిలుపుట కర్పించినాడు – ప్రభు తన ప్రాణమును
||చక్క||
ఆయన నుడివినదెల్ల – నెరవేర్చు వారే ధరలో
నిజమైన నారియగును – నిరుకవార్తయిదే
||చక్క||
ప్రియుడేసు పాడిన పాట – ప్రియురాలు పాడుచునుండ
ఏకమై ఎగిరిపోదురు – ఒక్క క్షణమందే
||చక్క||
వనితలెందరో గలరు – వధువు ఒక్కతియే గలదని
విభజించి విభుడు తెల్పె – పరమగీతములో
||చక్క||
సంఘమున్ సంపాదించి – సాతాను తలచిన క్రీడు
నెదిరించి ఐయెలు పరచె – బైబిలు మిషన్ లో
||చక్క||
నోవహుని నావయె సన్నిధి – అందరి అరలె వరములు
అందుకో పొందుగా నీ – వుండువు పరమందు
||చక్క||
ఐయెలు పరచెనానాడు – ఐయెలు పరచునాడు
ఐయెలు పరచును నేడు – భవిష్యత్కాలమున
||చక్క||
ఉంటివా! సన్నిధిలో – కనుగొంటివా! ప్రభుని మోము
ఒంటిగా మోకరించి – వింటివా ఆ స్వరము
||చక్క||
ఒంటి స్నానము చేసి – ఇంటిని శుద్ధిజేసి
కంటిని మూసి ప్రభుని – కొరకు కనిపెట్టు
||చక్క||
Chakkadanamunu minchina – chakkadanamu kaligina
Soundarya sanghamidiye – sarvasrushtilo
||Chakka||
Tanato samanamaina – swaroopamgala kanyakaga
Niluputa karpinchinadu – prabhu tana pranamunu
||Chakka||
Aayana nudivinadella – neraverchu vare dharalo
Nijamaina nariyagunu – nirukavartayide
||Chakka||
Priyudesu padina pata – priyuralu paduchununda
Ekamai egiripoduru – okka kshanamande
||Chakka||
Vanitlendaro galaru – vadhuvu okkatiye galadani
Vibhajinchi vibhudu telpe – paramageetamulo
||Chakka||
Sanghamun sampadinchi – Satanu talachina kreedu
Nedhirinchi ai yelu parache – Bible mission lo
||Chakka||
Novahuni navaye sannidhi – andari arale varamulu
Anduko ponduga nee – unduvu paramandu
||Chakka||
Ai yelu parachenanadu – ai yelu parachunadu
Ai yelu parachunu nedu – bhavishyatkaalamuna
||Chakka||
Untivaa! sannidhilo – kanugontivaa! prabhuni momu
Ontigaa mokarinchi – vintivaa aa swaramu
||Chakka||
Onti snanamu chesi – intini shuddhijesi
Kantini moosi prabhuni – koraku kanipettu
||Chakka||