Bhayapadaraadu Kreestu Vishwaasi Lyrics Telugu
భయపడ రాదు – క్రీస్తు విశ్వాసి
భయపడి దిగులు – పడరాదు సుమీ
భయపడుటెందుకు – బైబిలునందున
= నయమగు వాగ్ధానంబులు గలవు భయపడకుడనెడి పలుకులు నీకు
జయము గలుగ మూడు వందల అరువై – అయిదు గలవు
ఏడాది పొడుగున – భయపడకు నిరాశ పడకు మెందున
|| భయ ||
1. చిమ్మ చీకటులు – కమ్మిన రీతిగ
ఇమ్మహి కష్టము లెన్నో గలుగగ
నమ్మించు ద్రోహము నష్టము దుఃఖము
= సొమ్మసిల్లునటుల చుట్టు కొనంగ నమ్మిన వారికి వెలుగుగ
నక్షత్రమ్ములవలె వేన వేలు వాగ్ధాన – మ్ములుండ
ద్రోసి కీడు నిను – దూరమ్ము చేయ దొమ్మిగ రాగలదా
|| భయ ||
2. నీవే స్వయముగ – నీ కష్టములలో
దేవా యని ప్రార్థించుచు నుండగ దేవుని వగ్ధా
= నావళి నానుకొని దీవెన కొరకై – దిట్టముగ వేడుగ
దైవ గ్రంధమందునున్న వాక్యము – లే వరాల మూటయంచు
దానిలో జీవ మొంద నీవు చేయు ప్రార్థన – నే విధాన దాటి కీడు రాగలదా
|| భయ ||
3. పాటలు ప్రార్థన – వాక్య పఠనము
ధాటియౌ శుభవార్త ప్రకటనలు దీటగు కానుకల్
తెచ్చు సమర్పణ – నీటుగ జేసిన
= నిలబడ గలవు లోటు లేక యీ యాచారములను
మేటియనగ నీవు చేయుచుండగ వీటినెల్ల
నడ్డగించి నిజముగా – దాటి మీదికి కీడు రాగలదా
|| భయ ||
4. దిన దినమును ప్రార్థించి నీ కొరకు – మనవులు విజ్ఞాపనలు చేయు టకు
ఘనులగు భక్తులు – పని బూనిరి గదా – విని వర్ధిల్లుము విశ్వాసముతో
= కనికరించి తండ్రి వాక్యము నరు – లనయ మటులు చేయు మనిన విజ్ఞా
పనలను భక్తుల – నెగసి దాటుకొని నిను చిక్కుబెట్ట
రాగలదె కీడు
|| భయ ||
5. గాలి తుఫాను – బోలిన శ్రమలును
వేల దురాత్మలు తూలజేయ గను – వేల వేల
సైన్యాల దూతలు – తోలి వేతురు దయ్యాలను దూరము
= భూ లోకుల కంటే గూడ యోధులు – కాల జ్ఞాను లాత్మ రూపులా
దూతాళి నంత ఢీకొనుచు కీడు ఈ
వేళ నీ పైకి దండెత్త గలదా
|| భయ ||
6. పరలోకంబున – పరిశుద్ధులు నీ
కొరకై ప్రార్థన – నిరతము చేయగ అరమర
యేలను మురియుచు నుండుము – గురిదరి లేనట్లు వెరువగ నేల
= ధరణి లోన వారుకూడ నీ వలె – మరి మరి కష్టంబు లొంది నేడీ
తరుణమందు ప్రార్థించు ప్రార్థనలు
దొరలించి పైకి కీడు రా గలదా
|| భయ ||
7. శోధనలందున – బాధల యందున
ఆదరించు పరిశుద్ధాత్మ యుం డగా – మోదమొంద రా
బోవు సంగతులు – నీ దౌర్భల్యము నెరిగి వచించుచు
= వేదమందు చెప్పియున్న విధముగ – నీదు హృదయ మందు నిండియు
బోధ చేయు నాత్మతోడ కీడు
వాదులాడి నీ దరికి రాగలదా
|| భయ ||
8. దిక్కైనట్టి – దేవుడే నరుడై
మిక్కిలి ప్రేమతో – మేలు చేయుచు ఇక్కడ ఎన్నో
హింసలు పొంది – ఎక్కడ లేని మృతి జెంది బ్రతికి
= ఎక్కివెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్కనుండి ప్రార్థించు రక్షకుని
చక్కని విజ్ఞాపనల నెల్లను – ధిక్కరించి కీడు రా
గలుగునా
|| భయ ||
9. నేను సృజించిన – ఈ నరులందరు
మానక ప్రార్థనల్ గానముల్ చేయగ – నేను వినక పో
యిన నా సృష్టిని – నేనే నాశనము చేసి నట్లుండును
= గాన వారి ప్రార్థనాలకించెద – పూని కృపను జూపించెదనంచు
ఏనాటికి విడువననెడి తండ్రిని
గానకుండ కీడు దుమికి వచ్చునా
|| భయ ||
1o. శ్రమలు ఇబ్బందులు – సకల శోధనలు విమల మార్గము గా
వించు సాధనములు – సుమతి యోబొందిన
శోధనలన్నియు – సమయము రాగా – సాగిపొయెను
= విమలాత్మ స్నానమొందిన నీకు – శ్రమలలోన గలిగినట్టి యను
భవము నిరర్ధకము చేసి నీ సమీప
మునకైన కీడు చేర గలదా
|| భయ ||