అనాది వ్యక్తివైన దేవ || Anadi Vyaktivaina Deva Lyrics

WhatsApp Group Join Now

Anadi Vyaktivaina Deva Lyrics Telugu

అనాది వ్యక్తివైన దేవ – ఆత్మ స్తోత్రముల్
అంతము లేని తండ్రి అనంత స్తోత్రముల్ – ఎవరును చేయలేడు నిన్ను మహాప్రభో
నీ యంతట నీవుయున్నావు

||అ||

వెలుగువై యున్న దేవ – వేల ప్రణతులు
సూర్యబింబ చంద్రబింబ – తారారాసికీ
జీవిలోనికండ్లకును – వెలుగునొసంగి
వెలుగు చీకటి వేరుచేసితివి

||అ||

జ్ఞానివైయున్న దేవా – దివిని నిర్మించి
దీవినిగాక మిగత ఆరులోకముల్ చేసి
దూతలకును మనుజులకును జీవులకును
జ్ఞానదానంబు చేసిన శ్రీకర్త

||అ||

ప్రేమవైయున్న దేవా – ప్రేమవందనము
నీదు ప్రేమమహికి జూప ముద్దుబిడ్డయౌ
క్రీస్తు ప్రభుని భువికి పంపెనను దీయక
ప్రేమగుణము బయలుపర్చితివి

||అ||

న్యాయకర్తవైనదేవా – నీదు న్యాయము
యోనావంటి ప్రవక్త యందు మాదిరిజూపి
స్వస్థబుద్ధి కలుగువరకు నీదు దండము
శిక్ష ప్రేమ చూపుచుండుము

||అ||

శుద్ధఆత్మవైన దేవ – విశుద్ధివందనమ్
లోకమందు పాపమున్న శుద్ధియున్నది
వర్షజలపు ధారయందు ఫలములందును
పాపనరులలో శుద్ధియున్నది

||అ||

సర్వశక్తివైన దేవ సర్వమునీవే
చేసినావు క్రీస్తు ప్రభుని మృతులలో నుండి
సర్వమునుమార్చి వేయు శక్తిమంతుడా
సర్వకాల జీవమునీవే

||అ||

Anadi Vyaktivaina Deva Lyrics English

 Anadi vyaktivaina Deva – aatma stotramul
Anthamu leni tandri ananta stotramul – evarunu cheyaledu ninnu mahaprabho
Nee yantata neevuyunnavu

||A||

Veluguvai yunna Deva – vela pranatulu
Suryabimba chandrabimba – tararashiki
Jeevilonikandlakunu – velugunonsangi
Velugu cheekati veruchesitivi

||A||

Gnanivaiyunna Deva – divini nirminchi
Devinigaka migata aarulokamulu chesi
Doothalakunu manujalakunu jeevulakunu
Gnanadanambu chesina shreekarta

||A||

Premavaiyunna Deva – premavandanamu
Needu prema mahiki joopa muddu biddayau
Kristhu prabhuni bhuviki pampenanu deeyaka
Prema gunamu bayaluparchitivi

||A||

Nyayakartavaina Deva – needu nyayamu
Yonavanti pravaktha yandu madirijoopi
Swasthabuddhi kaluguvaraku needu dandamu
Shiksha prema chupuchundumu

||A||

Shuddhatmaivaina Deva – vishuddhivandanam
Lokamandu papamunna shuddhiyunnadi
Varshajalapu dharayandu phalamulandunu
Papa narulalo shuddhiyunnadi

||A||

Sarvashaktivaina Deva sarvamuneeve
Chesinavu Kristhu prabhuni mruthulalo nundi
Sarvamunu marchi veyu shaktimanthuda
Sarvakala jeevamuneeve ||A||

Leave a Comment