అమరుడవు నీవు నా యేసయ్యా || Amarudavu Neevu Naa Yesayya Lyrics

WhatsApp Group Join Now

Amarudavu Neevu Naa Yesayya Lyrics Telugu

అమరుడవు నీవు నా యేసయ్యా –
ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥
ఆదిలోనున్న నీ వాక్యమే –
ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥
సొమ్మసిల్లక సాగిపోదును – సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలకి౦తును – నీ దివ్య సన్నిధిలో

॥అమరుడవు నీవు॥

1) శక్తికి మి౦చిన సమరములో –
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ –
ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥
ప్రతి విజయము నీక౦కిత౦ –
నా బ్రతుకే నీ మహిమార్థ౦
లోకమంతయు దూరమైనను – నను చేరదీసెదవు
దేహమ౦తయు ధూళియైనను – జీవి౦పజేసెదవు

॥అమరుడవు నీవు॥

2) వేకువ కురిసిన చిరుజల్లులో –
నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు –
నవనూతనమే ప్రతిదినము ॥2॥
తీర్చగలనా నీ ఋణమును –
మరువగలనా నీ ప్రేమను
కన్నత౦డ్రిగ నన్ను కాచి – కన్నీరు తుడిచితివే
కమ్మనైన ప్రేమ చూపి – కనువిందు చేసితివే

॥అమరుడవు నీవు॥

3) జల్దరువృక్షమును పోలిన –
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్ధుడవు –
పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥
జయశీలుడవు నీవేనని –
ఆరాధింతును ప్రతినిత్యము
గు౦డెగుడిలో ని౦డినావు – నీకే ఆరాధన
ఆత్మదీపము వెలిగించినావు – నీకే ఆరాధన

॥అమరుడవు నీవు॥

Amarudavu Neevu Naa Yesayya Lyrics English

Amarudavu Neevu Naa Yesayya
Aadiyu Antamu Neevenayya ||2||
Aadilonunna Nee Vaakyame
Aadarichenu Sramakolimilalo ||2||
Sommassillaka Saagipodunu – Seeonulo Maargamulo
Sthotragitamu Aalakintunu – Nee Divya Sannidhilo

||Amarudavu Neevu||

Saktiki Minchina Samaramulo
Nerpitivi Naaku Nee Chittame
Sikshaku Kaave Shodhanallani
Unnata Kripato Nanu Ninputake ||2||
Prati Vijayamu Neekankitamu
Naa Brathuke Nee Mahimaarthamu
Lokamantayu Dhooramainanu – Nanu Cheradheesedavu
Dehamantayu Dhoohliyainanu – Jeevinpajesedavu

||Amarudavu Neevu||

Vekuva Kurisina Chirujallulo
Nee Krupa Naalo Pravaheenga
Ponditineenno Upakaaramulu
Navanoothaname Prathidinamu ||2||
Theerchagalanu Nee Runamunu
Maruvagalanu Nee Premanu
Kannatondriga Nannu Kaachi – Kanneeru Tudichitive
Kammanaina Prema Choopi – Kanuvindu Chesitive

||Amarudavu Neevu||

Jaldaruvruksamunu Polina
Gunashiludavu Neevenayya
Maranam Gelachina Parishuddhudavu
Punarutthanudavu Neevayya ||2||
Jayashiludavu Neevenani
Aaraadhintunu Prathinittyamu
Gundegudilo Nindinaavu – Neeeke Aaraadhana
Aatmadeepamu Veliginchinaavu – Neeeke Aaraadhana

||Amarudavu Neevu||

Leave a Comment