Biblemissionu Chaatandi Vishwaasulaara Lyrics Telugu
బైబిలుమిషను చాటండి విశ్వాసులారా – ఆభారమంత మీదేనండి విశ్వాసులారా
ఆమర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా
1: దేవదాసను ఒక ఋషికలరు – దేవునితో మాట్లాడెడివారు
ప్రభు క్రీస్తునకు ప్రియదాసుండు – పరిశుద్ధాత్మకు వశుడైనాడు
గాలిలో వ్రాసిన వ్రాతను చదివి – బైబిలుమిషను స్థాపించారని
2: రాజమండ్రిని విడిచినతోనే – గుంటూరు పట్టణమును చేరి
రాజారావుగారి గృహములో నిలచి – దేవుడు కనబడి మాట్లాడునని
రాజ్యసువార్తను ప్రకటించారని
3: ప్రతి సోమవారం కాకానిలో – స్వస్థతశాలను ఏర్పరచారు
రోగులందరిని బాగుచేయును – దయ్యములెన్నో వెడలించుటకు
యేసునామ మహిమార్థంబై – కాకానిని కానాగా మార్చెనని
4: మొదటి దీవెన స్వస్థతశాల – రెండవ దీవెన సంఘారాధన
మూడవ దీవెన సన్నిధికూటము – ఏడుసార్లు ప్రభు ప్రార్థన
కలపిన నూనె కాదు అది క్రీస్తు రక్తమని
5: సంఘములెన్నో స్థాపించారు – సంఘ గురువులను స్థిరపరిచారు
సిద్ధాంతములను వ్రాయించారు – సన్నిధి చేయుట నేర్పించారు
సన్నిధిలోనే బ్రతుకన్నారని
6: సంఘనాయకుడు ఎలీషాగారు – భక్తి శక్తి గల ధైర్యవంతుడు
సంఘమంతటికి నమ్మకస్తుడు – సంఘ వ్యవస్థను క్రమపరిచాడు
ప్రభువే రమ్మని పిలిచినారని – సాక్ష్యమిచ్చి పరలోకమేగెనని
7: ప్రతి గురువారం ప్రభు భోజనము – పాపక్షమాపణ పొందినవారే
సన్నిధిలో కనిపెట్టుచున్న – ప్రభువు తానే స్వయముగ వచ్చి
ప్రభు భోజనము యిచ్చి వెళ్ళునని
8: రాత్రింబగళ్ళు రక్షణ సువార్త – రాత్రింబగళ్ళు రాకడ స్తుతులు
రాత్రింబగళ్ళు ఉపవాసములే – పరిశుద్ధులతో సహవాసములని
9: దుష్టశక్తులను ఎదిరించండి – యేసునామమున బంధించండి
దేవునికి విధేయులు కండి – ఒకరిని ఒకరు ప్రేమించండి
సంఘమంతయూ కలిసి స్తుతించిన – ప్రభువే వానిని గోతిలో వేయును
10: సన్నిధి మొక్కను నాటించారు – సరసముగా రూతమ్మగారిచే
పాటలు ప్రార్థన వాక్యపఠనము – ధీటుగా కనిపెట్టుట నేర్పించి
నిత్యజీవ సన్నిధిగా మార్చి – పుస్తకములెన్నో వ్రాయించారని
Biblemissionu Chaatandi Vishwaasulaara Lyrics English
Biblemissionu Chaatandi Vishwasulaara – Aabharamanta Mide Naandi Vishwasulaara
Aamarmamu Purtiga Vippandi Vishwasulaara
1: Devadasanu Oka Rishikalaru – Devunito Matlade Divaru
Prabhu Kristunaku Priyadasundu – Parishuddatmaku Vashudainadu
Galilo Vrasina Vratanu Chadivi – Baibulumishanu Stapincarani
2: Rajamandrini Vidicina Tone – Gunturu Patnamunu Ceri
Rajaravugari Grhamulo Nilaci – Devudu Kanabadi Matladunani
Rajyasuvartanu Prakatincarani
3: Prati Somavaram Kakani Lo – Svastatasalanu Erparacaru
Rogulandarinni Baguceyun U – Dayyamuleno Vedalincutaku
Yesunama Mahimartambai – Kakanini Kanaga Marcenani
4: Modati Divena Svastatasala – Rendava Divena Sangaradana
Mudava Divena Sannidikootamu – Edusarlu Prabhu Prartana
Kalapina Nune Kadu Adi Kristu Raktamani
5: Sanghamuleno Stapincaru – Sanga Guruvulanu Stiraparincaru
Siddantamulanu Vrayincaru – Sannidiceyuta Nerpincaru
Sannidhi Lone Bratukannarani
6: Sanganayakudu Elisagaru – Bhakthi Sakti Gala Dhairyavantudu
Sangamam Tatiki Nammakastudu – Sanga Vyavasthanu Kramaparincadu
Prabhuve Rammanni Pilicarani – Saksyam Icci Paralokamegenani
7: Prati Guruvram Prabhu Bhojanamu – Papaksamapana Podinavare
Sannidhi Lo Kanipettucunna – Prabhu Tane Svayamuga Vachi
Prabhu Bhojanamu Icci Vellunani
8: Ratribagalu Rakshana Suvarta – Ratribagalu Rakada Stutulu
Ratribagalu Upavasamule – Parishuddhulato Sahavasamulani
9: Dushtasaktulanu Edirincandi – Yesunamamunu Bandincandi
Devuniki Vidheyulakandi – Okarini Okaru Premincandi
Sanghamantayu Kalisi Stutincina – Prabhuve Vanini Gotilo Veyunu
10: Sannidhi Mokkanu Natincaru – Sarasamuga Rutammagariche
Patalu Prartana Vakya Patanamu – Dhithuga Kanipettuta Nerpinci
Nityajiva Sannidhi Ga Marca – Pustakamuleno Vrayincarani