బైబిలు మిషనూ యొక్క భవ్య చరితను || Bible Mission Yokka Bhavyacharitanu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Bible Mission Yokka Bhavyacharitanu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now
Bible Mission Yokka Bhavyacharitanu Lyrics Telugu

(పల్లవి)
బైబిలు మిషనూ యొక్క
భవ్య చరితను వినరే భారతీయులారా
భయభక్తులతో పది తొమ్మిది వందల
ముప్పది ఎనిమిది వత్సరమున
పొందుగా జనవరి నెలలో
గాలిలో కనబడిన వ్రాతలు

|| బైబిలు ||

(చరణం 1)
దేవలోకమునుండి ధన్యవాయువులు కొన్ని
దైవజనుని గదిని దర్శింపవచ్చె
దైవజనుడు అది చూడ చూడగ
ధవళాక్షరము ముద్ర
బైబిలు మిషను అని
బాహటముగా చదివే

|| బైబిలు ||

(చరణం 2)
ప్రభు రాత్రి భోజనమునకు
పరిశుద్ధముగా వచ్చె
దేవదాసు ఘనుడు దేవాలయమునకు
పుచ్చుకోవద్దనుచు
వారు ప్రకటించిన ప్రకటన విని
ప్రభువే తానె ప్రక్కనుండి
పాత్ర నిచ్చెను పూర్తి చేసెను

|| బైబిలు ||

(చరణం 3)
విశ్వాసములో కొన్ని విభేదములు కలుగ
వాస్తవం వివరించిన వినరు వేదాంతుల్
వరుస తప్పెను విడువ వలసెను
వింతగా లూథరన్ మిషనున
వాక్యమునకు విధేయులై
విజ్ఞాపనముతో విడిచి వచ్చెను

|| బైబిలు ||

(చరణం 4)
బంతివలెనున్న బైబిలు మిషను
వింతగా చీలెను విశ్వాసుల వల్లనే
చింత చేతను కొంతకాలము
ఎంతో వేడెను ప్రభువు సన్నిధి
ఇంతవరకు కనిపెట్టుచుండెను
ఏమి చెప్పునో దైవ చిత్తము

|| బైబిలు ||

(చరణం 5)
సంఘమును స్థాపించి
సిద్ధాంతములు చేర్చి
మంగళ గీతములు మరికొన్ని చేర్చి
వరుసగా కుమారునికిచ్చి
రాజమండ్రిని విడిచి వచ్చి
పొందుగా గుంటూరు చేరి
పాడుగ చేసెను మిషను నెంతో

|| బైబిలు ||

(చరణం 6)
వందలకొలది నిందలు భరించుచు
కొందరిని కాకానికి క్రమముగా పంపె
వందలాది ప్రజలలో
వాక్యమందించుటయే గాక
సౌఖ్యమును చేకూర్చునట్టి
స్వస్థశాల ఏర్పరచె

|| బైబిలు ||

(చరణం 7)
సన్నిధి కూటములను
సంతోషముగా జేయు సాధనములు
నేర్పె సాధు దేవదాసు
సన్నిధి కూటముల ద్వారా
సాతాను నోడించి
సరిగా దైవస్వరమునూ
విను పద్ధతిని నేర్పించె

|| బైబిలు ||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment