పెళ్లంటే దేహములు వేరైనా || Pellante Dehamulu Verainaa Song Lyrics

WhatsApp Group Join Now

Pellante Dehamulu Verainaa Song Lyrics

దైవమె తన చిత్తముగా – చేసెగా ఘనమైనదిగా
ముడిపడే దృఢమైనదిగా – విడిపడే వీలు లేనిదిగా
కలలకే సాకారముగా – ఒకరికొకరు ఆధారముగా
తల్లి స్థానంలో భార్యనుగా – తండ్రి స్థానంలో భర్తనుగా…
నాదనే స్వార్ధము విడగా – మనదనే బంధము జతగా
ప్రతిదినం తీగలో లతగా – అల్లుకుపోయే చందముగా … ఆ…

పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే – గొప్ప అవకాశం
ఇహలోకాలలో శూన్యం ఉండగా – దైవం తలచినా
బంధం పెళ్లిగా మారెనుగా ! /పెళ్లంటే/

1. రెండుకళ్ళ వేరువేరు – శిరమునందు వేరుపారు
దృశ్యమేది చూపిస్తున్నా – చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు – ఒక్క పధము నందు చేరు
అడుగు ముందు వెనుకవుతున్న – గమ్యం మాత్రం కలిసే చేరు
ఇరువురొక్కటై – ఏక దేహమై
దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా
దేహ సుఖముకే – మనువు కొరక
దేవతనయులను పెంచాలని – దైవం నియమించెనుగా
ఆదిబంధమే ఆలుమగలుగా
అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా! /పెళ్లంటే/

2.వరుని కొరకు వధువు సంఘము – సిద్ధపరచబడితే అందము
ఏకదేహమంటే అర్ధము – క్రీస్తుతో సంఘము అనుబంధము
లోబడుటయే వధువుకు ఘనము – వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము
కళంకము ముడతలు లేని – పవిత్రమైన ప్రభువు శరీరము
తనకుతానుగా వదువుకోసమే – సమస్తమును అర్పించిన ప్రియ వరుడే ప్రాణప్రియుడు
మోసగించక మాటదాటక – వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు
గొప్పదైన ఆ.. పెళ్ళిమర్మము.. – క్రీస్తు వదువుకే సాదృశ్యము.. ఛాయారూపము! /పెళ్లంటే/

Pellante Dehamulu Verainaa Song Lyrics

God makes His will – glorious and grand
A bond so firm, unbreakable strand
Dreams take form, each other’s support
Wife as mother, husband as fort…
Leave “me” and selfishness behind
Join as “us,” hearts intertwined
Daily like vine on the tree
Clinging together, beautifully free… Ah…

Marriage: though bodies may part – God’s plan unites as one
Marriage: two as one, fulfilling Father’s work – a great chance won
In this world so empty, though God desired
The bond became marriage, as He inspired! /Marriage/

Two eyes separate – heads apart they stay
Though sights differ, gazes join in array
Two feet apart – on one path they tread
Steps forward, backward – goal ahead, together led
Two become one – a single body true
God Himself joined them for His family new
Not for flesh’s pleasure – nor man’s alone
To raise God’s children – as He decreed, His own
The first bond, source of all ties
Root uniting every bond that lies! /Marriage/

For the groom, the bride as church – prepared in beauty bright
One body means – church’s bond with Christ
Submission her glory – his love her health
Spotless, wrinkle-free – pure Lord’s body wealth
All surrendered for her – beloved groom, life so dear
Faithful, promise-kept – bride walks in his footsteps here
Great is this… marriage mystery… – shadow of Christ giving Himself… a reflection clear! /Marriage/

Leave a Comment