ఘన పర్చుడీ దేవుని || Ghana Parchudee Devuni Lyrics

WhatsApp Group Join Now

Ghana Parchudee Devuni Lyrics Telugu

ఘన పర్చుడీ దేవుని – త్రైక – జనకుడౌ యేకాత్ముని
మన యొద్ద నివసించు – మనసున్న తండ్రిని
మనసున ఘనపర్చుడీ – బాహ్యమున గూడ ఘన పర్చుడీ

|| ఘన ||

1. మన తండ్రిగా నుండను – మనలను తన బిడ్డలుగా జేర్పను
తన పుత్రుని ద్వారా – మను బాప్తిస్మాచార
మను నేర్పరచి యుండెను – తండ్రి చనువను గ్రహించెను

|| ఘన ||

2. బహిరంగ సంఘమునకు – పరిశుద్ధ – బాప్తిస్మమే ద్వారము
ఇహలోక మందున్న – ఈ మార్గమున్ మహా – మహిమగ భావించుడి
దైవ – సహవాసమున్ గాంచుడి

|| ఘన ||

3. పై యాచారముల వలన – దైవ – భక్తి యభ్యాసమౌను
ఆ యభ్యాసముచేత – అంతరంగ సభకై యాయత్త పడుదము
అప్పుడు – శ్రేష్ఠమౌ స్థితి గల్గును

|| ఘన ||

4. క్రీస్తు నామము దాల్చుము – స్నాన – క్రియ జరుగు సమయంబున
క్రీస్తు నామము లేని క్రియలన్ని వ్యర్థంబు
వాస్తవమే ప్రభునకు – జన్మ – వారసుల మౌదుము

|| ఘన ||

5. స్నాన మాత్మీయ జీవి – తమునకు జన్మస్థితి వంటిది
నా నాట నీ జీవ – నము వృద్ధి నొందును
స్నానేతరాచారముల్ – క్రమముగ జరుపుచున్న యెడలను

|| ఘన ||

6. పరలోక పరిశుద్ధులు – ఈ నరలోక పరిశుద్ధులు
పరమార్థ విషయాల – బంధు వర్గమౌట
పరిశుద్ధ బాప్తిస్మమే – మొదటి – ప్రాముఖ్య సాధనము

|| ఘన ||

Ghana Parchudee Devuni Lyrics English

Ghana Parachudee Devuni – Traika – Janakudau Yekaathmuni

Mana Yodha Nivasinchu – Manasunna Thandhrini
Manasuna Ghanaparachude – Baahyamuna Goonda Ghana Parachude

|| Ghana ||

Mana Thandhriga Nunndanu – Manalana Thana Biddaluga Jerpana
Thana Putruni Dwaaraa – Manuu Baaptismaachaara
Manuu Nerparachi Yundenu – Thandhri Chanuvanu Graahincheanu

|| Ghana ||

Bahiranga Sanghamunaku – Parishudha – Baaptismamee Dwaaramu
Ihalaoka Mandunna – Ee Maaragamun Mahaa – Mahimagha Bhaavincchudi
Daiva – Sahavaasamun Gaanjchudi

|| Ghana ||

Pai Yaachaaramura Valana – Daiva – Bhakthi Yabhyasamounu
Aa Yabhyasamuchetha – Antharanga Sabhakai Yaayatha Padudamu
Appudu – Shreshthamau Sthithi Galgunu

|| Ghana ||

Kreestu Naamamudhaalchumu – Snaana – Kriya Jarugu Samayambuna
Kreestu Naamamudhaani Kriyaalanu Vyarthambu
Vaasthavamee Prabhunaku – Janma – Vaarasula Maudumu

|| Ghana ||

Snaana Maathmeeya Jeevi – Thamunaku Janmasthithi Vantidhi
Naa Naata Nee Jeeva – Namu Vruddhi Nondunu
Snaanetharaachaarimul – Kramamuga Jarupuchunna Yedalunu

|| Ghana ||

Paralaoka Parishuddhulu – Ee Naralaoka Parishuddhulu
Paramaartha Vishayala – Bandhu Vargamaout
Parishudha Baaptismamee – Modhati – Praamukya Saadhanamu

|| Ghana ||

Leave a Comment