Vadhuvu Sanghamu Varunikoraku Lyrics Telugu
వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది
అధమమొక్క పాపమైన – అంటకుండ నున్నది
అంటనీయకున్నది అంటు అంటనుచున్నది
||వధువు||
1. వరుని ప్రేమ స్మరణతోనే – పరిపూర్ణమౌచున్నది
వరుని మీదనున్న ప్రేమ-పెరగనిచ్చుచున్నది
తరగనీయకున్నది-వరుడు వరుడను చున్నది
||వధువు||
2. ‘త్వరగ’ ననగా గురుతులైన – తరువాత అనుచున్నది
గురుతులు జరిగిన దొంతి – గురుతు పెట్టుచున్నది
వరుని గురుతున నున్నది – గురుతు గురుతనుచున్నది
||వధువు||
3. ‘త్వరగనన్నది’ నరునియాత్మకు – ప్రవచనమనుచున్నది
ఇరువదివందల యేండ్లయినను – ‘త్వరగ’నే యనుచున్నది
వధువు సిద్ధమనచున్నది – వధువు వధువనుచున్నది
||వధువు||
4. గురుతులను ప్రవచనములను – గణియించుచున్నది
సరిగనున్నవి రెండుననుచు – మురియుచునే యున్నది
తరచు తరచు చున్నది – సరియె సరియనుచున్నది
||వధువు||
5. ఆడితప్పనివాడు రాక – అట్టేయుండడనుచున్నది
నేడు వచ్చి వేసినట్టే – పాడుకొనుచున్నది
కీడు చూడకున్నది నేడు నేడనుచున్నది
||వధువు||
6. వరుడు వధువు నొక్కటే గనుక త్వరగా నిజమనుచున్నది
‘త్వరగ’లో ఇద్దరు దంపతులుగా బరుగు చుండ్రనుచున్నది
నిరుకు బ్రతుకనుచున్నది – నిరుకు నిరుకనుచున్నది
||వధువు||
7. ‘త్వరగ’ కడ్డులు లేవను నర్ధము విరివిగా చెప్పుచున్నది
నరులు నపవాదియు నడ్డు పరుపలేరనుచున్నది
వరుడడిగో యనుచున్నది పాపహరుడనుచున్నది
||వధువు||
8. తేదిరాక కున్నదన్న లేదు లేదనుచున్నది తేది అపుడు
తెలియు నన్న – తెలియనగు ననుచున్నది కాదు
ఇపుడనుచున్నది తేది తేదియనుచున్నది
||వధువు||
9. చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదె యనుచున్నది
ఆయత్తమౌనాటికి తేది – అందుననుచున్నది
మాయలేదనుచున్నది హాయి హయి యనుచున్నది
||వధువు||
10. ఇక్కడను పైనక్కడను – ఒక్క కుటుంబమే యగును
లెక్కకు రెండగును మరిమొక – లెక్కకు నొక్కియే యగును
ఒక్కియే మందయగును – ఒకియే సంఘమగును
||వధువు||
Vadhuvu Sanghamu Varunikoraku lyrics English
Vadhuvu sanghamu varuni koraku eduru chūchuchunnadi
Adhamokka pāpame ȳa – aṇṭakuṇḍa nunna adi
Aṇṭanīyakuṇṇadi aṇṭu aṇṭanuchunnadi
1. Varuni prema smaraṇatōne – paripūrṇamāyuchunnadi
Varuni mīdanunna prema-peraganichuchunnadi
Taraganīyakuṇṇadi-varuḍu varuḍanu chunnadi
2. ‘Tvarga’ nanagā gurutulenai – taruvāta anuchunnadi
Gurutulu jarigina donti – gurutu peṭṭuchunnadi
Varuni gurutuna nunna adi – gurutu gurutanuchunnadi
3.’Tvargananṇadi’ naruniyātmaku – pravachanamanuchunnadi
Iruvadivandala yēṇḍlayinanu – ‘tvarga’nē yanuchunnadi
Vadhuva siddhamanachunnadi – vadhuva vadhuvanuchunnadi
4. Gurutulanu pravachanamulanu – gaṇiyinchuchunnadi
Sariganunnavi reṇḍunanuchu – muriyuchunē yunnadi
Tarachu tarachu chunnadi – sariye sariyanuchunnadi
5. Āḍitappanivāḍu rāka – aṭṭēyuṇḍaḍanuchunnadi
Nēḍu vachchi vēsinnaṭṭē – pāḍukonuchunnadi
Kīḍu chūḍakuṇṇadi nēḍu nēḍanuchunnadi
6. Varuḍu vadhuva nokkaṭē ganuka tvragā nijamanuchunnadi
‘Tvarga’lō iddaru dampatulu gā barugu chunḍranuchunnadi
Niruku brathukanuchunnadi – niruku nirukanuchunnadi
7. ‘Tvarga’ kaḍḍulu lēvanu nardhamu virivigā cheppuchunnadi
Narulu napavādiyu naḍḍu parupalēranuchunnadi
Varuḍaḍigō yanuchunnadi pāpaharuḍanuchunnadi
8. Tēdirāka kunnaḍanna lēḍa lēḍanuchunnadi tēdi apuḍu
Teliyu nanna – teliyanagu nanuchunnadi kāḍu
Ipuḍanuchunnadi tēdi tēdiyanuchunnadi
9. Chēyaḍēmiyu prabhuvu sabhakku cheppanidē yanuchunnadi
Āyattamounāṭiki tēdi – andunachunnadi
Māyalēḍanuchunnadi hāyi hayi yanuchunnadi
10. Ikkaranu painakaranu – okka kuṭuṇbamē yagunu
Lekkaku reṇḍagunu marimoka – lekkaku nokkiyē yagunu
Okkkiyē maṇḍayagunu – okkiyē sanghamagunu