Saswathamaina Prema Song Lyrics Telugu
శాశ్వతమైన ప్రేమే నీదయ్యా
నీవు లేక నేను బ్రతుకలేనయ్యా
నను నిర్మించినది నీవే కదా
నాకై ప్రాణమిచ్చినది నీవే కదా
నీ సంకల్పమే నాలో నెరవేరనీ
నీ రూపమే నాలో కనిపించనీ
బ్రతుకంత సాగరమై కల్లోలమైనప్పుడు
ఆశల మేడలన్నీ కూలిపోయెను
నిరీక్షణ నాలో అడుగంటనీయక
నీ కృపా బాహువే నాన్నదుకున్నది
నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడు
నిశీధి నీడలే నన్నావరించెను
నీ నీతి కిరణము ఉదయింపచేసి
వాక్యమే దీపమై నను మండించినది
మారా అనుభవమే నాకు ఎదురైనపుడు
నా జీవన మాధుర్యమే చెదిరిపోయెను
మధురానుభవము నాలో నింపుటకు
ప్రభువా నీవే నా చెంత చేరితివి
Saswathamaina Prema Song Lyrics English
Shaashvatamaina prema needayyaa
Neevu leka neenu brathukalenayyaa
Nanu nirminchina di nive kada
Naakai praanamichchina di nive kada
Nee sankalpame naalo neraverani
Nee roopame naalo kanipinchanni
Brathukamtha saagaramayi kallolamainappudu
Aashala medalan ni koolipoyenu
Nireekshaṇa naalo adugamtaniiyaka
Nee krupa baahuve naannadukunnadi
Naa jeevitha gamanamulo shodhana ledhurainappudu
Nishidhi needhale nannaavarincenu
Nee neethi kiranam u udhayimpachesi
Vaakyame deepamayi nanu mandinchina di
Maara anubhavame naaku edhurainapudu
Naa jeevana maadhuryame chediripoyenu
Madhuraanubhavamu naalo nimpūtaku
Prabhuvaa nive naa chenta cherithivi